News November 21, 2024

శ్రీమంతుల విడాకులకు కారణాలు ఇవేనా?

image

మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, సైరా బానులు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా శ్రీమంతులు ఎక్కువగా విడాకులు తీసుకోవడానికి పలు కారణాలు ఉన్నట్లు విడాకుల న్యాయవాది వందనా షా తెలిపారు. డబ్బు పంపకం, పిల్లల బాధ్యత, బోర్‌డమ్, బిగ్గర్ బెటర్ డీల్, వివాహేతర సంబంధాలు, ఈగో వంటి సమస్యల వల్లే విడిపోతారని చెప్పారు. ధనవంతులు పెళ్లికి ముందే అగ్రిమెంట్ చేసుకోవడం బెటర్ అని ఆమె సూచించారు.

Similar News

News November 24, 2024

రాణించిన రాహుల్.. అతియా పోస్ట్ వైరల్

image

కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతం అవుతున్న కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో రాణించారు. రెండో ఇన్నింగ్స్‌లో అతడు 77 రన్స్ చేశారు. దీంతో రాహుల్ భార్య అతియా శెట్టి ఇన్‌స్టాలో పెట్టిన స్టోరీ వైరల్ అవుతోంది. ‘ఎప్పటికీ ఓటమిని ఒప్పుకోడు.. వెనక్కి తగ్గడు’ అని ఆమె క్యాప్షన్ ఇచ్చారు. కాగా రాహుల్, అతియా త్వరలోనే పేరెంట్స్ కానున్నారు. వచ్చే ఏడాది తాము బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ఇటీవల వారు ప్రకటించారు.

News November 24, 2024

విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ

image

పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (52) హాఫ్ సెంచరీ చేశారు. 3 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో ఆయన ఫిఫ్టీ పూర్తి చేసుకున్నారు. కాగా 13 ఇన్నింగ్స్‌ల తర్వాత విరాట్ అర్ధ సెంచరీ చేయడం విశేషం. ప్రస్తుతం భారత్ స్కోర్ 384/5గా ఉంది. క్రీజులో కోహ్లీతోపాటు వాషింగ్టన్ సుందర్ (18*) ఉన్నారు.

News November 24, 2024

నేనూ NCC క్యాడెట్‌నే: PM మోదీ

image

తాను కూడా NCC క్యాడెట్ అని ప్ర‌ధాని మోదీ తెలిపారు. ఆదివారం NCC దినోత్సవం సంద‌ర్భంగా ఈ అంశాన్ని ఆయ‌న మ‌న్ కీ బాత్‌లో ప్ర‌స్తావించారు. ‘ఈరోజు చాలా ప్రత్యేకమైనది. నేడు NCC దినోత్సవం. ఈ పేరు వినగానే మనకు స్కూల్, కాలేజీ రోజులు గుర్తుకొస్తాయి. నేనూ NCC క్యాడెట్‌నే. NCCలో అనుభవం నాకు అమూల్యమైనదని పూర్తి విశ్వాసంతో చెప్పగలను. NCC యువతలో క్రమశిక్షణ, నాయకత్వం, సేవా భావాన్ని పెంపొందిస్తుంద’ని పేర్కొన్నారు.