News November 21, 2024

1995 తర్వాత అత్యధిక పోలింగ్.. ఎవరికి అనుకూలమో?

image

మహారాష్ట్ర ఎన్నికల్లో నిన్న 65.1% పోలింగ్ నమోదైంది. 1995లో రికార్డు స్థాయిలో 71.5% ఓటింగ్ నమోదవగా, ఆ తర్వాత ఇదే అత్యధికం. ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకోవడం తమకే అనుకూలమని మహాయుతి, MVA ధీమాగా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ BJP కూటమివైపే మొగ్గు చూపగా, ఈ నెల 23న ఫలితాలు వెల్లడికానున్నాయి. కాగా 1999లో 61%, 2004లో 63.4%, 2009లో 59.7%, 2014లో 63.4%, 2019లో 61.4% పోలింగ్ రికార్డయ్యింది.

Similar News

News November 22, 2024

కాస్కో రేవంత్: బీఆర్ఎస్

image

TG: లగచర్ల గ్రామస్థుల అరెస్టుకు నిరసనగా తాము <<14666575>>మహబూబాబాద్‌లో<<>> చేపట్టనున్న నిరసనకు హైకోర్టు అనుమతిచ్చిందని బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. ‘కాస్కో రేవంత్. నువ్వెన్ని ఆంక్షలు పెట్టినా పేద దళిత, గిరిజన, ఆది వాసీ ప్రజల పక్షాన నిలబడతాం. న్యాయం జరిగే వరకు పోరాడతాం’ అని పేర్కొంది. ఈనెల 25న ఉ.10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 1000 మందితో ధర్నా చేసుకోవచ్చని బీఆర్ఎస్‌కు హైకోర్టు అనుమతి ఇచ్చింది.

News November 22, 2024

భోగాపురం ఎయిర్‌పోర్టుకు అల్లూరి పేరు: సీఎం చంద్రబాబు

image

AP: భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు అసెంబ్లీలో వెల్లడించారు. విమానాశ్రయం పక్కన అల్లూరి స్మారక మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే పార్లమెంటులో అల్లూరి, ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టాలని అనుకున్నామని చెప్పారు. అవసరమైతే దీనిపై తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని తెలిపారు.

News November 22, 2024

వచ్చే నెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు

image

TG: అసెంబ్లీ శీతాకాల సమావేశాలను డిసెంబర్ 9 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారం నుంచి పది రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నట్లు సమాచారం. ఈనెల 9న ఏడాదిలో చేసిన కార్యక్రమాలపై చర్చించిన అనంతరం సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని CM రేవంత్ ఆవిష్కరించనున్నారు. DEC 7 నాటికి ఏడాది పాలన పూర్తవుతున్న నేపథ్యంలో ఆలోగా క్యాబినెట్ విస్తరణను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.