News November 21, 2024

సెహ్వాగ్ కొడుకు డబుల్ సెంచరీ

image

IND మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తరహాలోనే కొడుకు ఆర్యవీర్ సెహ్వాగ్ అదరగొడుతున్నారు. కూచ్ బెహార్ ట్రోఫీలో భాగంగా మేఘాలయతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున అద్భుతమైన డబుల్ సెంచరీ చేశారు. 229 బంతుల్లోనే అజేయ ద్విశతకం బాదేశారు. ఇందులో 34 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో మేఘాలయ 260 పరుగులకు ఆలౌటైంది. ఆర్యవీర్ విజృంభణతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఢిల్లీ 468/2 స్కోర్ చేసింది.

Similar News

News November 22, 2024

డిసెంబర్ 7న రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్

image

TG: తమ డిమాండ్ల సాధనకు డిసెంబర్ 7న రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్‌తో పాటు HYDలో లక్ష మందితో భారీ ర్యాలీ, సభ నిర్వహిస్తామని రాష్ట్ర ఆటో డ్రైవర్స్ యూనియన్ జేఏసీ ప్రకటించింది. HYDలో 20వేల కొత్త ఆటోలకు పర్మిట్ ఇవ్వాలని, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చెల్లించి, యాక్సిడెంట్ బీమాను రూ.10లక్షలకు పెంచాలని డిమాండ్ చేసింది. ఒక్కో ఆటో డ్రైవర్ కుటుంబానికి రూ.12వేల ఆర్థిక సాయం పథకాన్ని వెంటనే అమలు చేయాలని పేర్కొంది.

News November 22, 2024

నేటితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు

image

ఈనెల 11న ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ‘రాజధాని అమరావతిలో గత ప్రభుత్వం సాగించిన విధ్వంసం, కూటమి ప్రభుత్వంలో రాజధాని పునర్నిర్మాణానికి చేపడుతున్న చర్యలు’ అనే అంశంపై నేడు సభలో చర్చ జరగనుంది. అనంతరం 2047-విజన్ డాక్యుమెంట్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన రిలీజ్ చేయనున్నారు. వరదలు, రుషికొండ ప్యాలెస్ తదితర అంశాలపైనా చర్చిస్తారని సమాచారం.

News November 22, 2024

కాస్కో రేవంత్: బీఆర్ఎస్

image

TG: లగచర్ల గ్రామస్థుల అరెస్టుకు నిరసనగా తాము <<14666575>>మహబూబాబాద్‌లో<<>> చేపట్టనున్న నిరసనకు హైకోర్టు అనుమతిచ్చిందని బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. ‘కాస్కో రేవంత్. నువ్వెన్ని ఆంక్షలు పెట్టినా పేద దళిత, గిరిజన, ఆది వాసీ ప్రజల పక్షాన నిలబడతాం. న్యాయం జరిగే వరకు పోరాడతాం’ అని పేర్కొంది. ఈనెల 25న ఉ.10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 1000 మందితో ధర్నా చేసుకోవచ్చని బీఆర్ఎస్‌కు హైకోర్టు అనుమతి ఇచ్చింది.