News November 21, 2024

2 జిల్లాల్లో 100% పూర్తయిన ఇంటింటి సర్వే

image

TG: సమగ్ర ఇంటింటి సర్వే జనగాం, ములుగు జిల్లాల్లో వందశాతం పూర్తయిందని ప్రభుత్వం తెలిపింది. నల్గొండ, కామారెడ్డి, మంచిర్యాల, భువనగిరి, జగిత్యాల, NZB, సిరిసిల్ల, గద్వాల, MBNR, మెదక్, మహబూబాబాద్, పెద్దపల్లి, ఆసిఫాబాద్, నారాయణపేట, భూపాలపల్లి, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో 90 శాతానికి పైగా సర్వే పూర్తయింది. GHMCలో 60.60% లక్ష్యాన్ని అందుకున్నట్లు సర్కార్ వివరించింది.

Similar News

News November 25, 2024

నోటీసులపై నటుడు అలీ స్పందన

image

అక్రమ నిర్మాణాలు ఆపాలని తనకు జారీ చేసిన నోటీసులపై నటుడు అలీ స్పందించారు. ఒక కన్వెన్షన్ సెంటర్ కోసం తన స్థలం లీజుకు ఇచ్చినట్లు చెప్పారు. కట్టడాలపై లీజుదారులే సమాధానం ఇస్తారన్నారు. వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట్ (M) ఎక్మామిడిలోని ఫామ్‌హౌస్‌లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని గ్రామ కార్యదర్శి శోభారాణి అలీకి నిన్న నోటీసులిచ్చారు. కట్టడాలను నిలిపివేయాలని అందులో పేర్కొన్న విషయం తెలిసిందే.

News November 25, 2024

శ్రీవారి దర్శనానికి 10 గంటల టైమ్

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. 8 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఏడుకొండలవాడిని నిన్న 75,147 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,096 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.16 కోట్లు లభించింది.

News November 25, 2024

1 బ్యారెల్ క్రూడ్ ఆయిల్ అంటే ఎన్ని లీటర్లో తెలుసా?

image

అంతర్జాతీయంగా ముడి చమురు (క్రూడ్ ఆయిల్)ను బ్యారెళ్లలో కొలుస్తారు. ఒక బ్యారెల్ ఆయిల్ 158.9 లీటర్లతో సమానం. ముడి చమురును రిఫైనరీల్లో శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్, జెట్ ఫ్యూయల్, కిరోసిన్, LPG, లూబ్రికెంట్స్ ఉత్పత్తి చేస్తారు. ప్రస్తుతం ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ రేటు రూ.6వేలు ఉంది. దీని ప్రకారం పెట్రోల్ రేటు రూ.37 వరకు ఉండాలి. కానీ రిఫైన్, రవాణా ఛార్జీలు, పన్నులు, కమీషన్లతో రేటు రూ.110గా ఉంది.