News November 21, 2024
విశాఖలో ట్రాఫిక్ ఎస్‌ఐ, రైటర్ సస్పెండ్
విశాఖలోని ద్వారకా పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ ఎస్‌ఐగా పనిచేస్తున్న ఎన్‌వి భాస్కరరావును, రైటర్ సీహెచ్.జయరావును గురువారం సాయంత్రం పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుకు సంబంధించి నగదు తీసుకొని కేసును డిస్పోజ్ చేస్తున్నారన్న ఫిర్యాదు మేరకు కమిషనర్ దర్యాప్తు చేసి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతికి పాల్పడిన వారిపై కమిషనర్ కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని కోరారు.
Similar News
News November 22, 2024
Pic Of The Day: విశాఖ ప్లేయర్‌కి క్యాప్ ఇచ్చిన కోహ్లీ
ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విశాఖ ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మ్యాచ్‌కు ముందు నితీశ్ కుమార్‌కు విరాట్ కోహ్లీ ఇండియా క్యాప్ అందించారు. గతేడాది IPLలో అదరగొట్టడంతో నితీశ్.. ఈ అక్టోబర్‌లో బంగ్లాతో జరిగిన T-20లో అరంగేట్రం చేశారు. అతన్ని వచ్చే సీజన్‌కు SRH రూ.6 కోట్లతో రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. 2024 నితీశ్‌కు గుర్తుండిపోతుందనే చెప్పొచ్చు.
News November 22, 2024
విశాఖ డెయిరీకి గడ్డుకాలం..!
విశాఖ డెయిరీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. పాల సేకరణ ధరలు తగ్గించారంటూ మొన్నటి వరకు పాడి రైతులు ఆందోళన చేయగా.. డెయిరీలో అవినీతిపై స్థాయీ సంఘం ఏర్పాటు చేస్తామని స్పీకర్ అయ్యన్న బుధవారం ప్రకటించారు. తమ న్యాయపరమైన డిమాండ్లు తీర్చాలంటూ పర్మినెంట్, కాంట్రాక్టర్ ఉద్యోగులు గురువారం నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ పరిణామాలు డెయిరీ మనుగడపై ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
News November 22, 2024
విశాఖ: జీవీఎంసీ క్రికెట్ జట్టు ఘన విజయం
విశాఖలో జింక్ మైదానంలో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో జీవీఎంసీ జట్టు ఘన విజయం సాధించిందని జీవీఎంసీ అదనపు కమిషనర్ రమణమూర్తి తెలిపారు. గురువారం జరిగిన వీడీసీఏ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో GVMC క్రికెట్ జట్టు 47 పరుగుల తేడాతో MOV జట్టుపై ఘన విజయం సాధించిందన్నారు. మొదటిగా బ్యాటింగ్ చేసిన జీవీఎంసీ జట్టు 20 ఓవర్లలో 159 పరుగులు చేసింది. అనంతరం MOV జట్టు 20 ఓవర్లలో 112 పరుగులు మాత్రమే సాధించి ఓటమి చెందిందన్నారు.