News November 21, 2024
VZM: రామతీర్థం అభివృద్ధికి ప్రతిపాదనలు ఇవే..

జిల్లాలో ఉన్న రామతీర్థం దేవస్థానాన్ని తీర్థయాత్ర పర్యాటక స్థలంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ అంబేడ్కర్ ఇటీవల సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. రామతీర్థంలో మ్యూజియం, కేఫ్ టేరియా, వ్యూ పాయింట్లు, రోప్‌వే నిర్మాణం, లైటింగ్, బౌద్ధ ప్రదేశాల వద్ద వసతులు, కోనేరు రహదారి విస్తరణ వంటి పనులకు అధికారులు త్వరలో ప్రతిపాదనలు తయారు చేయనున్నారు.
Similar News
News November 5, 2025
VZM: దివ్యాంగులకు సబ్సిడీతో రిట్రోఫిటేడ్ మోటరైజ్డ్ వాహనాలు

దివ్యాంగులకు 100% సబ్సిడీతో ప్రభుత్వం రిట్రోఫిటేడ్ మోటరైజ్డ్ వాహనాలను మంజూరు చేయనుందని జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకుడు ఆశయ్య బుధవారం తెలిపారు. అర్హులైన దివ్యాంగులు ఈనెల 25వ తేదీ లోగా www.apdascac.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వయస్సు 18-45 సంవత్సరాల మధ్య ఉండాలి. కనీసం 70% లోయర్ లింబ్ దివ్యాంగత కలిగి ఉండాలని, వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉండాలన్నారు.
News November 5, 2025
విజయనగరంలో 7న మెగా జాబ్ మేళా

APSSDC ఆధ్వర్యంలో ఈనెల 7న ఉదయం 9 గంటలకు విజయనగరం AGL డిగ్రీ కాలేజీ వద్ద మెగా జాబ్ మేళా నిర్వహించనున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత కుమార్ తెలిపారు. 18-35 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగులు పాల్గొనవచ్చని అన్నారు. SSC, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఏదైనా పీజీలో ఉత్తీర్ణత సాధించాలన్నారు.
12 కంపెనీలు నియామకాలు చేపడతాయని, naipunyam.ap.gov.in లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.
News November 5, 2025
పోలీస్ స్టేషన్‌కు వచ్చే వారితో మర్యాదగా ప్రవర్తించాలి: VZM SP

పోలీసు స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని ఎస్పీ దామోదర్ కోరారు. విజయనగరం ఎస్పీ కార్యాలయం నుంచి బుధవారం రీసెప్షనిస్టలుగా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్, మహిళా కానిస్టేబుల్స్, పోలీస్ అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. వివిధ సమస్యలపై స్టేషన్‌కు వచ్చే వారితో మర్యాదగా మాట్లాడి ఎందుకు వచ్చారో తెలుసుకోవాలన్నారు. ఫిర్యాదు రాయడం రానివారికి సిబ్బందే సాయం చేయాలని ఆదేశించారు.


