News November 21, 2024

ఈ సముద్రాలు కాంతులీనుతాయి!

image

రాత్రి వేళ సముద్రతీరాన ఉండే అనుభూతే వేరుగా ఉంటుంది. మరి సముద్రం నీలికాంతులతో ధగధగలాడుతుంటే ఇంకెంత అందంగా ఉంటుంది? భూమిపైకి స్వర్గమే వచ్చినట్లు కనిపిస్తుంది. ఆ కాంతుల్ని బయోలుమినిసెన్స్ అంటారు. భారత్‌లో అలాంటి సముద్ర తీరాల్లో కొన్ని.. కేరళలోని మునాంబం బీచ్, అండమాన్ నికోబార్ దీవుల సముదాయంలో ఒకటైన హావ్‌లాక్ దీవి, పశ్చిమ బెంగాల్‌లోని తాజ్‌పూర్ బీచ్, గోవాలోని కేరీ బీచ్, లక్షద్వీప్‌లోని బంగారం దీవి.

Similar News

News November 25, 2024

IPL వేలంలో ఖరీదైన ప్లేయర్లు

image

* పంత్- రూ.27కోట్లు (లక్నో, 2025)
* శ్రేయస్ అయ్యర్-రూ.26.75కోట్లు (పంజాబ్, 2025)
* స్టార్క్-రూ.24.75కోట్లు (కోల్‌కతా, 2024)
* కమిన్స్-రూ.20.50కోట్లు (SRH, 2023)
* శామ్ కరన్-రూ.18.50కోట్లు (పంజాబ్, 2023)
* అర్షదీప్ సింగ్-రూ.18కోట్లు (పంజాబ్, 2025)
* కామెరూన్ గ్రీన్-రూ.17.50కోట్లు (ముంబై, 2023)
* బెన్ స్టోక్స్-రూ.16.25కోట్లు (చెన్నై, 2023)
* క్రిస్ మోరిస్-రూ.16.25కోట్లు(రాజస్థాన్, 2021)

News November 25, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: నవంబర్ 25, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 5:10 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:27 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12:03 గంటలకు
అసర్: సాయంత్రం 4:04 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5:40 గంటలకు
ఇష: రాత్రి 6.56 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 25, 2024

శబరిమలలో పోటెత్తిన భక్తజనం

image

శబరిమల ఆలయానికి భక్తజనం రద్దీ కొనసాగుతోంది. సీజన్ కావడంతో స్వాములు తండోపతండాలుగా అయ్యప్పను దర్శించుకుంటున్నారు. తొలి 9రోజుల్లో సుమారు 6 లక్షలమంది భక్తులు కొండకు వచ్చారని అంచనా. గత ఏడాది ఇదే కాలంలో 3 లక్షల పైచిలుకు భక్తులు మాత్రమే వచ్చారని, ఈసారి రద్దీ చాలా ఎక్కువగా ఉందని ఆలయ అధికారులు తెలిపారు. భక్తజనం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.