News November 22, 2024

ఝులన్ గోస్వామికి అరుదైన గౌరవం

image

ఈడెన్ గార్డెన్స్‌లోని ఓ స్టాండ్‌కు భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్, పేస్ బౌలర్ ఝులన్ గోస్వామి పేరు పెట్టనున్నట్లు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరి 22న ఈడెన్‌లో జరిగే IND-ENG మ్యాచ్ సందర్భంగా ఈ కార్యక్రమం ఉంటుంది. ఈమె 2002-2022 మధ్య 204 ODIలు, 68 T20లు, 12 టెస్టులు ఆడి 355 వికెట్లు తీశారు. కాగా మాజీ క్రికెటర్లు గంగూలీ, పంకజ్ పేర్లతో మాత్రమే ఈడెన్‌లో స్టాండ్స్ ఉన్నాయి.

Similar News

News November 22, 2024

అసెంబ్లీలో ఓట్లు నమోదు చేస్తున్న MLAలు

image

AP: అసెంబ్లీలో PAC, PUC, అంచనాల కమిటీల్లో సభ్యుల ఎన్నిక కొనసాగుతోంది. MLAలు బ్యాలెట్ పద్ధతిలో ఓట్లు నమోదు చేస్తున్నారు. మధ్యాహ్నం 2గంటల వరకు కమిటీ హాలులో జరగనున్న ఈ ఎన్నిక ప్రక్రియ బాధ్యతను విప్‌లకు అప్పగించారు. పబ్లిక్ అకౌంట్స్(PAC) కమిటీని ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. PACలో సభ్యుడు కావాలంటే కనీసం 18 ఓట్లు కావాల్సి ఉండగా, YCPకి 11ఓట్లే ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నిక ఆసక్తికరంగా మారింది.

News November 22, 2024

BGT: తొలి సెషన్‌ ఆసీస్‌దే

image

భారత్‌తో తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఫస్ట్ డే తొలి సెషన్‌లో పైచేయి సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బ్యాటర్లు ఆసీస్ బౌలింగ్‌కు బెంబేలెత్తారు. కనీసం బాల్‌ను టచ్ చేయడానికే కష్టపడ్డారు. దీంతో జైస్వాల్, పడిక్కల్ డకౌట్ అయ్యారు. కోహ్లీ 5 రన్స్‌తో నిరాశపరిచారు. రాహుల్ కాస్త మెరుగ్గా ఆడినా చివరికి 26 రన్స్ వద్ద వెనుదిరిగారు. దీంతో ఫస్ట్ సెషన్ ముగిసేసరికి IND 51రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయింది.

News November 22, 2024

STOCK MARKETS: భారీ లాభాల్లోనే..

image

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లోనే మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి పాజిటివ్ సిగ్నల్స్ రావడమే ఇందుకు కారణం. నిఫ్టీ 23,458 (+107), సెన్సెక్స్ 77,548 (+390) వద్ద ట్రేడవుతున్నాయి. ఆరంభ లాభాలతో పోలిస్తే కాస్త తగ్గాయి. మీడియా, మెటల్, కన్జూమర్ డ్యురబుల్స్ మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. రియాల్టి, PSU బ్యాంక్ షేర్లు పుంజుకున్నాయి. ADANIENT, ADANI PORTS, M&M, AXIS BANK, HEROMOTO టాప్ లూజర్స్.