News November 22, 2024
శ్రీశైలంలో ఉచిత బస్సు సౌకర్యం: EO
AP: శ్రీశైలం క్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ చర్యలు చేపట్టినట్లు EO చంద్రశేఖర్ తెలిపారు. పండుగలు, పర్వదినాల్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ORR సమీపంలో పార్కింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అక్కడి నుంచి గణేశ్ సదన్ మీదుగా అన్నదాన భవనం, డొనేషన్ సెంటర్, క్యూ కాంప్లెక్స్, నంది సర్కిల్ వరకు ఉ.5 నుంచి మ.12 వరకు ప్రతి అరగంటకు ఒక ఉచిత బస్సును నడపనున్నట్లు చెప్పారు.
Similar News
News November 22, 2024
బోనస్ మాట బోగస్ అయింది: హరీశ్ రావు
TG: ఈనాం కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. రూ.500 బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ మాట బోగస్ అయిందని ఖమ్మం పత్తి మార్కెట్లో ఆరోపించారు. జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా రైతుల సమస్యలపై సమీక్ష చేసే తీరిక లేదన్నారు. పెట్టుబడి సాయం ఇవ్వకపోగా మద్దతు ధర లేదని, రైతులకు రుణమాఫీ చేయలేదని ఆరోపించారు. ప్రతిపక్షాలపై కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని హరీశ్ రావు విమర్శించారు.
News November 22, 2024
సింపుల్‌గానే చై-శోభిత పెళ్లి: నాగార్జున
అక్కినేని నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల వివాహం సింపుల్‌గా జరుగుతుందని నాగార్జున తెలిపారు. వీరి వివాహం డిసెంబర్ 4న HYDలోని అన్నపూర్ణస్టూడియోస్‌లో జరగనుంది. అయితే ఇందుకు 300-400 మంది కుటుంబ సభ్యులు, బంధువులు, ఇండస్ట్రీలోని సన్నిహితులను మాత్రమే ఆహ్వానించామన్నారు. వారిద్దరూ సింపుల్ వెడ్డింగ్ కోరుకోవడంతో ఏర్పాట్లను కూడా వాళ్లకే వదిలేశానన్నారు.
News November 22, 2024
మణిపుర్‌లో మీ చిదంబరం చేసింది మర్చిపోయారా: ఖర్గేపై నడ్డా ఫైర్
మణిపుర్ పరిస్థితిని కాంగ్రెస్ సెన్సేషనల్ చేయడానికి పదేపదే ప్రయత్నించడం షాకింగ్‌గా ఉందని BJP చీఫ్ జేపీ నడ్డా అన్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే లేఖ రాయడంపై మండిపడ్డారు. ‘విదేశీ మిలిటెంట్ల అక్రమ వలసల్ని చట్టబద్ధం చేసింది, వారితో ఒప్పందాలు కుదుర్చుకున్నదే అప్పటి HM, మీ చిదంబరం అని మర్చిపోయారేమో. దేశాన్ని అస్థిరపరిచే విదేశీ శక్తులకు మీరు వత్తాసు పలకడం ఆందోళనకరం’ అని అన్నారు.