News November 22, 2024
ట్రోల్స్ చూసి నా కొడుకు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు: రోజా
ట్రోల్స్ చేసిన టీడీపీ, జనసేన కార్యకర్తలను వదలనని వైసీపీ నేత ఆర్కే రోజా అన్నారు. వారు చేసిన ట్రోల్స్ వల్ల తన కుమారుడు వారంపాటు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడని ఎమోషనల్ అయ్యారు. ‘నా అన్నయ్య, కొడుకు ముద్దు పెట్టిన ఫొటోలను కూడా మార్ఫింగ్ చేసి వేధించారు. నా కూతురు, కుమారుడి సోషల్ మీడియా ఖాతాల్లో అసభ్యకర సందేశాలు పెట్టి ట్రోల్స్ చేశారు. దమ్ముంటే వారిని అరెస్ట్ చేయాలి’ అని ఆమె ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
Similar News
News November 22, 2024
టెట్ అభ్యర్థులకు అలర్ట్.. నేడే లాస్ట్
TG: టెట్ అభ్యర్థులకు దరఖాస్తులు ఎడిట్ చేసుకునే అవకాశం నేటితో ముగియనుంది. బుధవారమే దరఖాస్తు ప్రక్రియ ముగియగా తప్పులను సరిచేసుకోవడానికి ఈ నెల 22 వరకు ఎడిట్ ఆప్షన్ కల్పించారు. ఇదిలా ఉంటే కొన్ని ప్రాంతాల్లో సర్వర్లు డౌన్ కావడంతో తాము అప్లై చేసుకోలేకపోయామని, దరఖాస్తు గడువు పెంచాలని కొందరు కోరుతున్నారు.
News November 22, 2024
దెబ్బకు దిగొచ్చిన కెనడా: హత్యలతో మోదీకి సంబంధం లేదంటూ వివరణ
హర్దీప్‌నిజ్జర్ హత్య, ఇతర నేరాలతో PM మోదీకి సంబంధం లేదని కెనడా స్పష్టం చేసింది. ఈ ఆరోపణలను ధ్రువీకరించే ఆధారాలేమీ లేవని వెల్లడించింది. గ్లోబ్, మెయిల్ న్యూస్‌పేపర్లలో కథనాలు వదంతులేనని తెలిపింది. అమిత్ షా, జైశంకర్, అజిత్ దోవల్, మోదీకి నిజ్జర్ హత్యకు సంబంధం ఉన్నట్టు ఈ పత్రికలు చిత్రీకరించాయి. దీంతో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న దౌత్యసంబంధాలు ఇంకా దెబ్బతింటాయని భారత్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
News November 22, 2024
బోనస్ మాట బోగస్ అయింది: హరీశ్ రావు
TG: ఈనాం కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. రూ.500 బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ మాట బోగస్ అయిందని ఖమ్మం పత్తి మార్కెట్లో ఆరోపించారు. జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా రైతుల సమస్యలపై సమీక్ష చేసే తీరిక లేదన్నారు. పెట్టుబడి సాయం ఇవ్వకపోగా మద్దతు ధర లేదని, రైతులకు రుణమాఫీ చేయలేదని ఆరోపించారు. ప్రతిపక్షాలపై కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని హరీశ్ రావు విమర్శించారు.