News November 22, 2024

పోలీసులు అప్రమత్తంగా ఉండాలి: ప్రకాశం ఎస్పీ

image

పట్టణాలు, గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను గుర్తించడంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం ఎస్పీ దామోదర్ సూచించారు. ప్రజలు, విద్యార్థులకు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల పర్యవసనాలు, గుడ్, బ్యాడ్ టచ్, రోడ్డు ప్రమాదాల నివారణలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ మేరకు ఎస్పీ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.

Similar News

News January 20, 2026

ఒంగోలు SP కీలక ఆదేశాలు

image

మహిళలు, చిన్నారుల రక్షణే లక్ష్యంగా శక్తి బృందాలు క్షేత్రస్థాయిలో మరింత పటిష్ఠంగా పని చేయాలని ప్రకాశం ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు సూచించారు. ఒంగోలులోని తన కార్యాలయంలో డీఎస్పీలు, శక్తి బృందాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. బస్టాండ్లు, ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్లు, ఈవ్ టీజింగ్ జరుగుతున్న ప్రదేశాల్లో ఏ సమస్య ఎదురైనా త్వరగా వెళ్లాలని ఆదేశించారు.

News January 20, 2026

ప్రకాశం జిల్లా కలెక్టర్‌కు అవార్డు

image

ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబుకు ప్రత్యేక అవార్డు దక్కింది. ఓటర్ల మ్యాపింగ్‌లో సాధించిన పురోగతికి బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డుకు ఆయనను ఎంపిక చేశారు. 2002 ఎస్ఐఆర్ డేటాతో 2026 ఎస్ఐఆర్ డేటాను సరిపోలడంలో కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈనెల 25న విజయవాడలో జరిగే కార్యక్రమంలో ఆయన అవార్డు అందుకోనున్నారు.

News January 20, 2026

కందుకూరు: ఈ కష్టం ఎవరికీ రాకూడదు..!

image

కందుకూరు కానిస్టేబుల్‌ సాజిద్ విషమ పరిస్థితి అందరి మనసులను కలచివేస్తోంది. తల్లిని అత్యవసర చికిత్స కోసం అంబులెన్స్‌లో తరలిస్తుండగా బైక్‌పై ఫాలో అవుతున్న సాజిద్ <<18904402>>ప్రమాదానికి <<>>గురై ప్రాణాపాయస్థితిలో ఒంగోలులో చికిత్స పొందుతున్నాడు. ఈలోగా ఆయన తల్లి కన్నుమూశారు. కోమాలో ఉన్న సాజిద్‌కు అది తెలియదు. తల్లి అంత్యక్రియలు కూడా చూడలేని సాజిద్‌కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. ఆయన తండ్రి ఓ టైలర్.