News November 22, 2024

రాష్ట్రస్థాయి పోటీలకు NZB క్రీడాకారులు

image

నవీపేట ప్రభుత్వ బాలుర పాఠశాలలో గురువారం రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ ఎంపిక పోటీలు నిర్వహించారు. అండర్-17 విభాగంలో ఉమ్మడి జిల్లాలకు చెందిన 38 మంది బాలికలు, 28 మంది బాలురు పోటీల్లో పాల్గొన్నారు. ఇందులో నుంచి ఐదుగురు బాలికలు, 8మంది బాలురు ఈ నెల 23 నుంచి 25వ తేది వరకు సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్‌లో జరిగే రాష్ట్రస్థాయి  పోటీల్లో పాల్గొనడానికి ఎంపిక అయ్యారు.

Similar News

News November 25, 2024

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిద్దాం: కల్వకుంట్ల కవిత

image

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించుదామని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఆదివారం ఆమె పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ.. దేశ చరిత్రలోనే అధికారంలోకి వచ్చిన పదినెలల్లోనే ఇంత ప్రజా వ్యతిరేకత మూట గట్టుకున్న ప్రభుత్వం ఎక్కడా లేదన్నారు. కాగా పార్టీ మారిన వ్యక్తులను ప్రజలకు క్షమించరని పేర్కొంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామన్నారు.

News November 24, 2024

NZB: మాజీ సైనికులకు ఆర్టీసీలో ఉద్యోగాలు

image

సైనిక సంక్షేమ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మాజీ సైనికులకు TGS RTCలో ఉద్యోగాలు కల్పించనుంది. ఈ మేరకు RTC నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,201 డ్రైవింగ్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో 110 ఉద్యోగాలు ఉన్నట్లు పేర్కొన్నారు. 18నెలల అనుభవంతో కూడిన హెవీ డ్యూటీ లైసెన్స్, 58 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారు అర్హులు. ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

News November 24, 2024

KMR జిల్లాలో సంక్షేమానికి చేసిన ఖర్చు వివరాలు

image

జిల్లాలో 23 శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను సమీక్షిస్తున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. PM కిసాన్ సమ్మాన్ నిధికి రూ.531.6 కోట్లు, మధ్యాహ్న భోజనం రూ.9.68 కోట్లు, ఉపాధి హామీ పథకం రూ.73 కోట్లు, ఆసరా పింఛన్లకు రూ.36.75 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.61.25 కోట్లు, RRRకు రూ.16.63 కోట్లు, MP లాడ్స్‌కు రూ.59.37 లక్షలు, PM ఆదర్శ్ గ్రామ యోజన పథకానికి రూ.49.50 లక్షలు ఖర్చు చేశామన్నారు.