News November 22, 2024
కడపలోని ఏపీజీబీని అమరావతికి తరలించవద్దు

కడప నగరం కేంద్రంగా ఉన్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అమరావతికి తరలిపోతుందని వార్త జిల్లావ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న తరుణంలో గురువారం సీఎం చంద్రబాబును కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ బ్యాంక్‌ను కడప కేంద్రంగానే కొనసాగించాలని ఉద్యోగులు, ప్రజల తరుపున విన్నవించారు. గ్రామీణ ప్రజలకు సేవలు అందిస్తున్న ఈ బ్యాంక్‌ను ఎట్టి పరిస్థితుల్లో తరలించవద్దన్నారు.
Similar News
News January 10, 2026
గండికోట ఉత్సవాలు.. హెలికాఫ్టర్ రైడ్ ధర తగ్గింపు

గండికోట ఉత్సవాలలో హెలికాఫ్టర్ రైడింగ్‌లో ధరల తగ్గించినట్లు కలెక్టర్ తెలిపారు. ముందుగా ఒక వ్యక్తికి రూ. 5 వేలుగా నిర్ణయించగా.. దానిని రూ.3 వేలకు తగ్గిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. 6 నిమిషాలు రైడింగ్ ఉంటుందన్నారు. గండికోట చుట్టు పక్క ప్రాంతాలు, గండికోట ప్రాజెక్టు, మైలవరం జలాశయాన్ని హెలికాఫ్టర్ ద్వారా వీక్షించే అవకాశం ఉంటుందన్నారు.
News January 10, 2026
యాక్సిడెంట్.. కడప యువకుడి మృతి

కదిరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప జిల్లా లింగాలలోని రామట్ల పల్లికి చెందిన అశోక్ (26) మృతి చెందాడు. బెంగళూరుకు బైకులో వెళుతుండగా మార్గమధ్యంలో డివైడర్‌ను ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీంతో మృతుని కటుంబంలో విషాదం అలుముకుంది.
News January 10, 2026
swayamలో ఉచితంగా వెబ్ డిజైన్ కోర్సులు: VC

నాణ్యమైన విద్యను అందించే <


