News November 22, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: నవంబర్ 22, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున 5:09
సూర్యోదయం: ఉదయం 6:25
దుహర్: మధ్యాహ్నం 12:02
అసర్: సాయంత్రం 4:04
మఘ్రిబ్: సాయంత్రం 5:40
ఇష: రాత్రి 6.55
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News November 22, 2024

నడ్డా లేఖలో అన్నీ అబద్ధాలే: జైరామ్ రమేశ్

image

మణిపుర్ వివాదంపై ఖర్గేకు JP నడ్డా రాసిన <<14675488>>లేఖ<<>>లో అన్నీ అబద్ధాలే ఉన్నాయని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ విమర్శించారు. అందులో DENIAL, DISTORTION, DISTRACTION, DEFAMATIONతో కూడిన ‘4D ఎక్సర్‌సైజ్’ మాత్రమే ఉందని వివరించారు. ‘రాష్ట్రానికి PM ఎప్పుడొస్తారు? మెజార్టీ MLAలు వ్యతిరేకిస్తున్నా CM ఎందుకు కొనసాగుతున్నారు? వైఫల్యాలకు అమిత్ షా ఎప్పుడు బాధ్యత తీసుకుంటారు’ అని మణిపుర్ ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు.

News November 22, 2024

డిసెంబర్ నుంచి పెన్షన్ల పెంపు?

image

TG: వచ్చే నెల 7వ తేదీ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తి కానుంది. ఆలోగా ఆసరా పెన్షన్ల పెంపు, రైతు భరోసా పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం ఆసరా పింఛన్లకు ₹2,016, దివ్యాంగ పింఛన్లకు ₹3,016 ఇవ్వగా, తాము ఆసరా పింఛను ₹4,000, దివ్యాంగ పింఛన్ ₹6,000 చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రైతు భరోసా కింద ఏటా ఎకరాకు ₹15,000 అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

News November 22, 2024

శాసనమండలిలో మాటల యుద్ధం

image

AP: శాసనమండలిలో EBC రిజర్వేషన్లపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. గత ప్రభుత్వ DBT విధానం వల్ల చాలామంది గంజాయి బారినపడ్డారని మంత్రి సవిత అన్నారని, ఆమె ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని తోట త్రిమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఇరుపక్షాలు వాదనకు దిగడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, రికార్డుల నుంచి వాటిని తొలగిస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు.