News November 22, 2024

అతి చిన్నవయస్కురాలైన పైలట్ గురించి తెలుసా?

image

దేశంలో అతి చిన్న వయస్సులో కమర్షియల్ పైలట్‌ లైసెన్స్ పొందిన రికార్డు హిమాచల్‌కు చెందిన సాక్షి కొచ్చర్ పేరిట ఉంది. 10ఏళ్ల వయసుకే పైలట్ కావాలని ఆమె నిర్ణయించుకున్నారు. అందుకు కుటుంబీకులూ అండగా నిలిచారు. ఇంటర్ పూర్తి కాగానే ముంబైలోని స్కైలైన్ ఏవియేషన్ క్లబ్‌లో పైలట్ శిక్షణకు పంపించారు. అనంతరం అమెరికాలో ట్రైనింగ్ పొందిన సాక్షి, కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందారు.

Similar News

News November 22, 2024

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్

image

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 10 మంది మావోలు మరణించారు. ఉదయం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయని బస్తర్ IG సుందర్ రాజ్ తెలిపారు.

News November 22, 2024

తేనెకు అందుకే ఎక్స్‌పైరీ ఉండదు!

image

ఏ వస్తువుకైనా ఎక్స్‌పైరీ తేదీని చూసేవారు తేనెకు చూడరు. ఎందుకంటే అది పాడవదు. స్వచ్ఛమైన తేనె దశాబ్దాలైనా పాడవదని పెద్దలు చెప్తుంటారు. ఎందుకో ఆలోచించారా? ‘తేనెలో ఉండే 17శాతం నీరు దీనిని చెడిపోకుండా చేస్తుంది. తక్కువ నీటి శాతం బ్యాక్టీరియాను నిర్జలీకరణం చేస్తుంది. దీంతో చెడిపోదు. ఆమ్లత్వం కూడా 3.9శాతం ఉండటం మరో కారణం. తేమను పీల్చుకునే సామర్థ్యం తేనెకు ఉండటం కూడా ఓ కారణమే’ అని నిపుణులు చెబుతున్నారు.

News November 22, 2024

‘పుష్ప-2’ మళ్లీ వాయిదా అంటూ ప్రచారం.. స్పందించిన మేకర్స్

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మరోసారి వాయిదా పడనుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాలకు తెరదించేలా మేకర్స్ ట్విటర్‌లో ఓ పోస్ట్ చేశారు. మూవీలో అల్లు అర్జున్ మేనరిజం వీడియోను షేర్ చేసి ‘డిసెంబర్ 5.. అస్సలు తగ్గేదేలే’ అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో అనుకున్న తేదీకే మూవీ రానున్నట్లు క్లారిటీ వచ్చేసింది. అలాగే USA ప్రీమియర్స్ డిసెంబర్ 4న పడతాయని మేకర్స్ తెలిపారు.