News November 22, 2024

నవంబర్ 22: చరిత్రలో ఈ రోజు

image

1913: ఆర్థికవేత్త, ఆర్బీఐ 8వ గవర్నర్ లక్ష్మీకాంత్ ఝా జననం
1963: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడి మరణం
1968: మద్రాసు రాష్ట్రం పేరును తమిళనాడుగా మార్చే బిల్లుకు లోక్‌సభ ఆమోదం
2006: భారత మహిళా రసాయన శాస్త్రవేత్త అసీమా చటర్జీ మరణం
2016 : సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ మరణం (ఫొటోలో)

Similar News

News January 17, 2026

లిక్కర్ కేసులో విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు

image

AP: లిక్కర్ స్కాం కేసులో YCP మాజీ MP విజయసాయిరెడ్డికి ED నోటీసులిచ్చింది. ఈ నెల 22న తమ ఎదుట హాజరుకావాలని పేర్కొంది. YCP హయాంలో అమలు చేసిన మద్యం విధానంలో అక్రమాలు జరిగాయని ED విచారణ జరుపుతోంది. ఆ టైమ్‌లో జగన్‌కు సన్నిహితంగా ఉన్న VSRకి నోటీసులివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. మద్యం సరఫరాదారులు, డిస్టిలరీల నుంచి ముడుపులు అందినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి.

News January 17, 2026

ఇంటి చిట్కాలు

image

* జిడ్డు పట్టిన గ్యాస్ లైటర్‌ను ఒక క్లాత్‌పై కాస్త లైజాల్, నిమ్మకాయ, బేకింగ్ సోడాతో తుడిస్తే గ్యాస్ లైటర్ మెరిసిపోతుంది.
* నెయిల్ పాలిష్ క్లీనర్‌తో తుడిస్తే ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డులపై మరకలు పోతాయి.
* ఒక కప్పు వేడి నీటిలో 2 చెంచాల వెనిగర్‌ వేసి బాగా కలిపి, వాషింగ్ మెషీన్ మరకలపై స్ప్రే చేసి కాసేపు అలాగే ఉంచాలి. తర్వాత క్లీనింగ్ బ్రష్‌తో శుభ్రం చేస్తే మరకలు ఈజీగా తొలగిపోతాయి.

News January 17, 2026

మొక్కజొన్నలో బొగ్గు కుళ్లు తెగులు – నివారణ

image

బొగ్గు కుళ్లు తెగులు ఎక్కువగా సోకే ప్రాంతాల్లో పంటవేసే ముందు పచ్చిరొట్ట పైరును సాగుచేసి నేలలో కలియదున్నాలి. ఎకరాకు అదనంగా 30 కిలోల పొటాష్‌ను ఇచ్చే ఎరువులను వేయాలి. ఎండాకాలంలో నేలను లోతుగా దున్నాలి. పంట వేసిన తర్వాత ముఖ్యంగా పూతదశ నుంచి నేలలో తేమ తగ్గకుండా నీటి తడులు పెట్టాలి. పంటకోసిన తర్వాత తెగులు సోకిన మొక్కల భాగాలను ఏరి కాల్చివేయాలి. పంటమార్పిడి పద్ధతిని అనుసరించాలి.