News November 22, 2024
BGT: ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య తొలి టెస్టు మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. కాగా ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్‌తోపాటు హాట్ స్టార్‌లో కూడా వీక్షించవచ్చు. స్థానిక భాషల్లోనూ మ్యాచ్ లైవ్ అవుతుంది. కాకపోతే ఈ ఛానళ్లను సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. డీడీ స్పోర్ట్స్‌లో ఫ్రీగా చూడవచ్చు. ఇందుకు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.
Similar News
News January 25, 2026
టాస్ గెలిచిన టీమ్ ఇండియా.. టీమ్స్ ఇవే

న్యూజిలాండ్‌తో మూడో టీ20లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్‌కు విశ్రాంతినిచ్చి వారి స్థానంలో బుమ్రా, బిష్ణోయ్‌ను తుదిజట్టులోకి తీసుకున్నారు.
IND: శాంసన్, అభిషేక్, ఇషాన్, సూర్య, హార్దిక్, దూబే, రింకూ సింగ్, హర్షిత్, బుమ్రా, కుల్దీప్, బిష్ణోయ్.
NZ: కాన్వే, సీఫర్ట్, రచిన్, ఫిలిప్స్, చాప్‌మన్, మిచెల్, సాంట్నర్, జెమీసన్, హెన్రీ, సోథీ, జాకబ్.
News January 25, 2026
రోహిత్ శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్‌కు పద్మశ్రీ అవార్డ్స్

ఈ ఏడాది క్రీడల రంగంలో 8 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. క్రికెట్‌లో రోహిత్ శర్మతో పాటు హర్మన్‌ప్రీత్ కౌర్‌కు లభించాయి. అలాగే మహిళల హాకీ గోల్‌కీపర్ సవితా పునియా, అథ్లెట్ ప్రవీణ్ కుమార్, పంజాబ్‌కు చెందిన బల్దేవ్ సింగ్, MP నుంచి భగవాన్‌దాస్ రైక్వార్, పుదుచ్చేరి కె.పజనివేల్‌ను అవార్డులు వరించాయి. జార్జియాకు చెందిన వ్లాదిమిర్ మెస్త్విరిష్విలికి మరణానంతరం పద్మశ్రీ ప్రకటించారు.
News January 25, 2026
ఏ తిథి రోజున ఎవరిని ఆరాధించాలంటే..? (1/2)

పాడ్యమి: ఆరోగ్యం, తేజస్సు కోసం అగ్ని దేవుడు.
విదియ: విద్య, జ్ఞానం కోసం బ్రహ్మ దేవుడు.
తదియ: సౌభాగ్యం కోసం, గౌరీ దేవి (పార్వతి).
చతుర్థి: విఘ్నాల తొలగింపు, విజయం కోసం వినాయకుడు.
పంచమి: సంతాన ప్రాప్తి, కుజదోష నివారణకై నాగదేవత.
షష్ఠి: శత్రు జయం, ధైర్యం, దోష వినాశనానికి కుమారస్వామి.
సప్తమి: ఆరోగ్య సిద్ధి, కంటి సమస్యల నివారణకై సూర్యుడు
అష్టమి: భయ నివారణ, రక్షణ కోసం దుర్గాదేవి.


