News November 22, 2024
పాక్‌లోకి త్వరలో చైనా సైన్యం.. ఎందుకంటే?
పాక్‌లో ఉంటున్న తమ దేశస్థులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వారి భద్రత కోసం చైనా సెక్యూరిటీని ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే మూడు ప్రైవేట్ కంపెనీలను నియమించుకుంది. అలాగే తమ సైన్యాన్ని కూడా పాక్‌లో మోహరించాలని యోచిస్తోంది. CPEC ప్రాజెక్ట్స్ కోసం దాదాపు 30వేల మంది చైనా ఇంజినీర్లు, కార్మికులు అక్కడ ఉంటున్నారు. వారి భద్రతపై చైనా ఆందోళన చెందడంతో పాక్ సర్కార్ కూడా రక్షణ రంగానికి నిధులను పెంచింది.
Similar News
News November 22, 2024
సంక్రాంతి లోపు పనులు పూర్తి చేస్తాం: పవన్ కళ్యాణ్
AP: NREGS ద్వారా రూ.4,500 కోట్లతో 30వేల పనులు చేపట్టినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. సంక్రాంతి లోపు ఆ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ఉపాధి పథకం నిధుల మళ్లింపు, జాబ్ కార్డుల్లో అవకతవకలు జరిగాయని MLAలు సభ దృష్టికి తీసుకురాగా, వాటిపై విచారణ చేస్తామని పవన్ ప్రకటించారు. ఉపాధి హామీ కింద కాలువల్లో పూడిక, గుర్రపుడెక్క తొలగింపు, శ్మశానవాటికల ప్రహరీల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు.
News November 22, 2024
‘కన్నప్ప’ నుంచి మోహన్ బాబు లుక్ రివీల్
మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ మూవీ ‘కన్నప్ప’ నుంచి అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో మోహన్ బాబు నటిస్తోన్న ‘మహాదేవ శాస్త్రి’ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాత్ర చాలా ఏళ్లు గుర్తుండిపోతుందని విష్ణు ట్వీట్ చేశారు. కాగా, ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మోహన్ బాబు నిర్మిస్తున్నారు.
News November 22, 2024
చరిత్రలో ఎవరూ చేయని తప్పులు చేశారు: CBN
AP: చరిత్రలో ఎవరూ చేయని తప్పులు గత సీఎం జగన్ చేశారని CM చంద్రబాబు అన్నారు. వ్యవస్థలు విధ్వంసమయ్యాయని, అధికార యంత్రాంగం నిర్వీర్యమైందని మండిపడ్డారు. నమ్మిన అసత్యాలను పదే పదే చెప్పి ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు. అందుకే విజన్ డాక్యుమెంట్ -2047పేరుతో షార్ట్, మీడియం, లాంగ్ టర్మ్ లక్ష్యాలతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. రౌడీ రాజకీయాలు చేస్తామంటే పెట్టుబడిదారులు రాష్ట్రానికి రారని సీఎం తెలిపారు.