News November 22, 2024
నెల్లూరు: ఇంటర్ విద్యార్థులకు డిప్లొమా కోర్సులు

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్యశాలలో ఇంటర్ (బైపీసీ) విద్యార్థులకు డిప్లొమా కోర్సులను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రిన్సిపల్ వీరవెంకట నాగరాజ మన్నార్ తెలిపారు. డిప్లొమా ల్యాబ్, అనస్థీషియన్, ఆప్తాల్మిక్, ఆప్తోమెట్రీ, మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్స్ కోర్సులలో 95 సీట్లు ఉన్నాయన్నారు. ఆసక్తి గల విద్యార్థులు డిసెంబర్ 2 తేదీలోపు రూ.100లు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News March 24, 2026
రాపూరు వస్తే.. అవకాశం ఎవరికి..!

కొత్త నియోజకవర్గాల ఏర్పాటుతో నెల్లూరు జిల్లాలో మరలా ఊహగానాలు మొదలయ్యాయి. 1952లో ఏర్పాటైన రాపూరు నియోజకవర్గం డీలిమిటేషన్లో భాగంగా 2008లో ఈ ప్రాంతం శాసనసభ స్థానాల నుంచి తొలగించబడింది. 1952 నుంచి 2004 వరకు జరిగిన ఎలక్షన్స్‌లో టీడీపీ 3 సార్లు, కాంగ్రెస్ 5 సార్లు, ఒక్కసారి స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. మరలా రాపూరు నియోజకవర్గాన్ని ప్రకటిస్తే రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉంది.
News March 24, 2026
నెల్లూరు జిల్లాలో సదరం స్లాట్ ప్రారంభం

నెల్లూరు జిల్లాలో కొన్ని ఏళ్లుగా దివ్యాంగులు సదరం స్లాట్ల బుకింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ప్రక్రియ జిల్లాలోని అన్ని సచివాలయాల్లో మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. సమాచారం అందుకున్న దివ్యాంగులు ఆయా సచివాలయాలకు సమగ్ర వివరాలతో వెళ్లి నమోదు చేయించుకుంటున్నారు. ఆధార్, రేషన్ కార్డు, ఆధార్‌తో లింక్ అయిన ఫోన్ నంబర్ వెంట తీసుకుని వెళ్లాలి.
News March 24, 2026
నెల్లూరు: రైలు నుంచి జారిపడి ఒకరి మృతి

నెల్లూరు రైల్వే స్టేషన్‌లో ఒకరు చనిపోయారు. చెన్నై నుంచి విజయవాడ వెళ్తున్న రైలు నుంచి జారిపడి సోమవారం రాత్రి ఒకరు మృతిచెందారు. అతని వయస్సు 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండవచ్చు. 5.4 అడుగుల ఎత్తు చామన ఛాయ రంగు కలిగి ఉన్నాడు. గ్రీన్ కలర్ ఫుల్ హ్యాండ్ షర్ట్, బ్యాక్ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. రైల్వే ఎస్ఐ హరి చందన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


