News November 22, 2024

BREAKING.. వాజేడు : అన్నదమ్ములను హతమార్చిన మావోలు

image

ములుగు జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీస్ ఇన్‌ఫార్మర్లనే నెపంతో అన్నదమ్ములను కత్తులతో పొడిచి హతమార్చారు. ఈ ఘటన వాజేడు మండలం జంగాలపల్లిలో జరిగింది. మృతులు ఊక అర్జున్, రమేశ్‌గా గుర్తించారు. రమేశ్ పంచాయతీ సెక్రటరీగా పని చేస్తున్నట్లు సమాచారం. కాగా, వాజేడు మావోయిస్టు కమిటీ శాంత పేరిట మావోలు లేఖ వదిలారు.

Similar News

News February 21, 2026

ఖమ్మం: అడవిని తలపిస్తున్న క్రీడా ప్రాంగణాలు

image

గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం లక్షలతో నిర్మించిన క్రీడా ప్రాంగణాలు జిల్లాలో నిరుపయోగంగా మారాయి. అధికారులు నిర్లక్ష్యంగా ఎక్కడపడితే అక్కడ వీటిని ఏర్పాటు చేయడంతో క్రీడాకారులు అడుగుపెట్టని పరిస్థితి నెలకొంది. ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో మైదానాలో చెట్లు పెరిగి అడవిని తలపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీటిని వినియోగంలోకి తీసుకురావాలని క్రీడాకారులు కోరుతున్నారు.

News February 21, 2026

స్త్రీనిధి రుణాలు సకాలంలో చెల్లించాలి: ఖమ్మం డీఆర్డీవో పీడీ

image

స్త్రీనిధి ద్వారా తీసుకున్న రుణాలు పెండింగ్ ఉంచకుండా సకాలంలో చెల్లించాలని ఖమ్మం డీఆర్డీవో పీడీ శ్రీరామ్ స్పష్టం చేశారు. గ్రామదీపికల నిర్లక్ష్యం వల్ల వడ్డీ భారం పెరుగుతుందని, అవకతవకలకు తావులేకుండా వసూళ్లు చేపట్టాలని సూచించారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు పనులు కల్పించి, హాజరు శాతాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

News February 21, 2026

ఖమ్మం: ‘ఏప్రిల్ 20 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు’

image

ఖమ్మం జిల్లాలో ఏప్రిల్ 20 నుంచి 27 వరకు సార్వత్రిక పదో తరగతి, ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో చైతన్యజైని తెలిపారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 28 నుంచి మే 5 వరకు జరుగుతాయని పేర్కొన్నారు. తెలంగాణ సార్వత్రిక విద్యా పీఠం ఆధ్వర్యంలో జరిగే ఈ పరీక్షలకు విద్యార్థులు సిద్ధం కావాలని ఆమె సూచించారు.