News November 22, 2024
రహానే సరసన బుమ్రా నిలుస్తారా?
AUS గడ్డపై కెప్టెన్సీ చేసిన తొలి టెస్టులో గెలిచిన ఏకైక భారత కెప్టెన్‌గా రహానే పేరిట రికార్డు ఉంది. నేడు ప్రారంభం కానున్న BGT తొలి టెస్టులో భారత్ గెలిస్తే రహానే సరసన బుమ్రా చేరనున్నారు. AUSలో బుమ్రాకు కెప్టెన్‌గా ఇదే ఫస్ట్ టెస్ట్. కాగా గతంలో అమర్నాథ్, చందు బోర్డే, పటౌడీ, బిషన్, గవాస్కర్, అజహరుద్దీన్, సచిన్, కుంబ్లే, ధోనీ, సెహ్వాగ్, కోహ్లీ AUSలో కెప్టెన్‌గా తమ తొలి టెస్టులో ఓడారు.
Similar News
News November 22, 2024
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మంత్రి కీలక వ్యాఖ్యలు
AP: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై మంత్రి డీబీవీ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకాన్ని తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ‘గతంలో ఈ పథకం నిధులను తల్లి-విద్యార్థి ఖాతాలో జమ చేస్తామని మోసం చేశారు. YCP ప్రభుత్వం ఫీజులు ఇవ్వకుండా ఎగ్గొట్టింది. మెస్, ట్యూషన్ ఛార్జీలు కూడా చెల్లించలేదు. ఇకపై విద్యార్థుల ఫీజుల బకాయిలు కాలేజీ యాజమాన్యాలకే నేరుగా చెల్లిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.
News November 22, 2024
ఐదేళ్ల క్రితమే CBN కుట్ర చేశారని YCP బాంబ్
AP: కరెంట్ ఛార్జీలతో పాతికేళ్లు రాష్ట్ర ప్రజల నడ్డి విరిచేందుకు ఐదేళ్ల క్రితమే చంద్రబాబు కుట్ర చేశారని ట్రూత్ బాంబ్ పేరుతో YCP ‘X’లో పోస్ట్ చేసింది. 2019లో కమీషన్ల కోసం యూనిట్‌కు రూ.5.90 చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొంది. కానీ, 2021లో సెకీతో YCP యూనిట్‌కి రూ.2.49తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. ‘ఇప్పుడు చెప్పు చంద్రబాబు, అసలైన అవినీతిపరుడు నువ్వు కాదా?’ అని ప్రశ్నించింది.
News November 22, 2024
చెరువుల పరిధిలోని ఇళ్లను కూల్చబోము: రంగనాథ్
TG: చెరువుల పరిధిలోని ఇళ్లను కూల్చబోమని, చెరువులను కాపాడాలంటే నివాసాలను కూల్చాల్సిన పనిలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. నిర్మాణాలు కూల్చి చెరువులను కాపాడటం హైడ్రా ఉద్దేశం కాదని, చెరువుల పరిధిలో కొత్త నిర్మాణాలను అడ్డుకోవడం లక్ష్యమన్నారు. కొంతమందిపై చర్యలతో హైడ్రా పని అందరికీ తెలిసిందని, FTL, బఫర్ జోన్లపై అవగాహన వస్తోందని చెప్పారు. ఆక్రమణల నియంత్రణకు సాంకేతికత వాడుతున్నామన్నారు.