News November 22, 2024
ప్రభుత్వంలో నా స్థానం 11: పొంగులేటి
TG: ప్రభుత్వంలో తాను 11వ స్థానంలో ఉన్నానని మంత్రి పొంగులేటి అన్నారు. సీఎం రేవంత్ తర్వాతి స్థానంలో ఎవరు ఉన్నారని ఎదురైన ప్రశ్నకు ఆయన ఇలా బదులిచ్చారు. రెండో స్థానంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారని చెప్పారు. అటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావొస్తున్న సందర్భంగా డిసెంబర్ 7లోపు మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని పొంగులేటి అన్నారు.
Similar News
News November 25, 2024
ముంబై ఇండియన్స్‌లోకి మరో తెలుగు కుర్రాడు
ఐపీఎల్ మెగా వేలంలో తెలుగు కుర్రాడు కాకినాడకు చెందిన పెన్మత్స వెంకట సత్యనారాయణ రాజును ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. రూ.30 లక్షల బేస్ ప్రైస్‌కే ఆయనను సొంతం చేసుకుంది. ఇప్పటికే ముంబై జట్టులో హైదరాబాదీ తిలక్ వర్మ ఉన్న సంగతి తెలిసిందే. కాగా వైజాగ్‌కు చెందిన అవినాశ్‌ను రూ.30 లక్షలకు పంజాబ్ కొనుగోలు చేసింది. అయితే బైలపూడి యశ్వంత్, విజయ్ కుమార్ అన్‌సోల్డ్‌గా మిగిలారు.
News November 25, 2024
Women Tax Payers: ఏపీలో కంటే తెలంగాణలో ఎక్కువ
ఆదాయ పన్ను చెల్లించే మహిళలు ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో అధికంగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఏపీ నుంచి 6.53 లక్షల మంది మహిళలు పన్ను చెల్లించారు. అదే తెలంగాణలో 8.55 లక్షల మంది పన్ను చెల్లించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. గత ఐదేళ్ల గణాంకాలు తీసుకున్నా ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే మహిళలు తెలంగాణలో అధికంగా ఉన్నట్టు నివేదిక వెల్లడించింది.
News November 25, 2024
ఇది కదా విజయం అంటే..!
లక్ష్య ఛేదనలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకు సాగితే ఫలితం దక్కుతుందన్న మాటలను డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిరూపించారు. ‘2004లో గోవాలో IFFIల ఈవెంట్ మేనేజ్మెంట్‌లో నాగ్ పనిచేశారు. సరిగ్గా 20 ఏళ్లకు IFFI పుస్తకంలో ఆయనకు ఓ పేజీ కేటాయించారు. ఈ విషయాన్ని ఆయన ఇన్‌స్టాలో పంచుకున్నారు. కాగా ‘మహానటి’తో నేషనల్ అవార్డు అందుకున్న ఆయన ‘కల్కి’తో రూ.వెయ్యి కోట్ల కలెక్షన్స్ సాధించిన డైరెక్టర్‌గా చరిత్రలోకెక్కారు.