News November 22, 2024

మైదానంలో ప్రత్యక్షమైన ‘వర్చువల్’ పుజారా

image

భారత టెస్ట్ స్పెషలిస్ట్ క్రికెటర్ పుజారా పెర్త్ స్టేడియంలో వర్చువల్‌గా ప్రత్యక్షమై అందర్నీ ఆశ్చర్యపర్చారు. BGTలో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌కు హిందీ, ఇంగ్లిష్ భాషల్లో పుజారా కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు భాషల్లో ఒకేసారి ఇలా వర్చువల్‌గా కనిపించారు.

Similar News

News November 22, 2024

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మంత్రి కీలక వ్యాఖ్యలు

image

AP: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంపై మంత్రి డీబీవీ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకాన్ని తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ‘గతంలో ఈ పథకం నిధులను తల్లి-విద్యార్థి ఖాతాలో జమ చేస్తామని మోసం చేశారు. YCP ప్రభుత్వం ఫీజులు ఇవ్వకుండా ఎగ్గొట్టింది. మెస్, ట్యూషన్ ఛార్జీలు కూడా చెల్లించలేదు. ఇకపై విద్యార్థుల ఫీజుల బకాయిలు కాలేజీ యాజమాన్యాలకే నేరుగా చెల్లిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.

News November 22, 2024

ఐదేళ్ల క్రితమే CBN కుట్ర చేశారని YCP బాంబ్

image

AP: కరెంట్ ఛార్జీలతో పాతికేళ్లు రాష్ట్ర ప్రజల నడ్డి విరిచేందుకు ఐదేళ్ల క్రితమే చంద్రబాబు కుట్ర చేశారని ట్రూత్ బాంబ్ పేరుతో YCP ‘X’లో పోస్ట్ చేసింది. 2019లో కమీషన్ల కోసం యూనిట్‌కు రూ.5.90 చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొంది. కానీ, 2021లో సెకీతో YCP యూనిట్‌కి రూ.2.49తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. ‘ఇప్పుడు చెప్పు చంద్రబాబు, అసలైన అవినీతిపరుడు నువ్వు కాదా?’ అని ప్రశ్నించింది.

News November 22, 2024

చెరువుల పరిధిలోని ఇళ్లను కూల్చబోము: రంగనాథ్

image

TG: చెరువుల పరిధిలోని ఇళ్లను కూల్చబోమని, చెరువులను కాపాడాలంటే నివాసాలను కూల్చాల్సిన పనిలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. నిర్మాణాలు కూల్చి చెరువులను కాపాడటం హైడ్రా ఉద్దేశం కాదని, చెరువుల పరిధిలో కొత్త నిర్మాణాలను అడ్డుకోవడం లక్ష్యమన్నారు. కొంతమందిపై చర్యలతో హైడ్రా పని అందరికీ తెలిసిందని, FTL, బఫర్ జోన్లపై అవగాహన వస్తోందని చెప్పారు. ఆక్రమణల నియంత్రణకు సాంకేతికత వాడుతున్నామన్నారు.