News November 22, 2024
సంక్రాంతి తర్వాత సర్పంచ్ ఎన్నికలు?
TG: 2025 జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. డిసెంబర్ రెండో వారం నాటికి రిజర్వేషన్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, డిసెంబర్ చివర్లో లేదా జనవరి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత మొత్తం మూడు విడతల్లో సర్పంచ్ ఎన్నికలను పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.
Similar News
News November 22, 2024
3వ అతిపెద్ద అణ్వాయుధ నిల్వలు.. వదులుకున్న ఉక్రెయిన్!
ఇప్పుడంటే ఆయుధాల కోసం అమెరికా వద్ద చేయి చాస్తోంది కానీ సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన కొత్తలో ఉక్రెయిన్ వద్ద ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆయుధ నిల్వలు ఉండేవి. 5వేలకు పైగా అణ్వాయుధాలు, 170కి పైగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు, వార్ హెడ్స్ వంటి వాటినన్నింటినీ 1996కల్లా రష్యాకు ఇచ్చేసింది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంలో చేరి, అందుకు బదులుగా స్వతంత్ర దేశంగా ప్రపంచ దేశాల నుంచి గుర్తింపు తెచ్చుకుంది.
News November 22, 2024
మనసు చంపుకుని పని చేస్తున్నా: రంగనాథ్
TG: హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో మానవత్వంతో ఆలోచిస్తే సమాజం మొత్తం బాధపడుతుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. కొన్నిసార్లు మనసు చంపుకుని పని చేస్తున్నానని ఆయన చెప్పారు. ‘అనుమతులు లేకుంటే పెద్దలవా, పేదలవా అని ఆలోచించం.. కూల్చడమే. ఇకపై కబ్జాలు జరగకుండా చూస్తాం. హైడ్రా పనితీరు వల్ల ప్రజల్లో అవగాహన పెరిగింది. వారే చెరువులు, నాలాల కబ్జాలను అడ్డుకుంటున్నారు’ అని ఆయన పేర్కొన్నారు.
News November 22, 2024
నాలుగు నెలల కనిష్ఠానికి విదేశీ మారక నిల్వలు
భారత విదేశీ మారక నిల్వలు గత వారంలో ఏకంగా $17.8 బిలియన్ మేర పతనమయ్యాయి. ఈ భారీ తగ్గుదల నేపథ్యంలో నిల్వలు $657.89 బిలియన్లకు చేరుకుని నాలుగు నెలల కనిష్ఠ స్థాయిని తాకాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరం డాలర్ విలువ క్రమంగా పెరగడం వంటి పరిణామాల నేపథ్యంలో రూపాయి విలువను బలపరిచేందుకు ఫారెక్స్ మార్కెట్‌లో ఆర్బీఐ తన నిల్వలను అమ్మకాలకు ఉంచడం ఈ పరిస్థితికి కారణమైంది.