News November 22, 2024
క్రికెట్ కలిపింది ఇద్దరినీ: మోదీ
భారత్, గయానా బంధాన్ని క్రికెట్, కల్చర్, కుసైన్ మరింత గాఢంగా మార్చాయని PM మోదీ అన్నారు. అక్కడి భారతీయులు, క్రికెటర్లతో మాట్లాడారు. ‘క్రికెట్‌పై ప్రేమ మన రెండు దేశాల్ని బలంగా కలుపుతోంది. అది ఆటే కాదు ఓ జీవన విధానం. అది మనకు గుర్తింపునిచ్చింది. రెండు దేశాల దినుసులు కలిపిచేసే ఇండో గయానిస్ వంటలు ప్రత్యేకం. దాల్‌పూరి ఇక్కడ ఫేమస్. నాకు చక్కని ఆతిథ్యం అందించిన ప్రెసిడెంట్ అలీకి థాంక్స్’ అని అన్నారు.
Similar News
News November 22, 2024
దీపక్ హుడా బౌలింగ్‌పై నిషేధం?
టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ దీపక్ హుడా బౌలింగ్ శైలి అనుమానాస్పదంగా ఉండటంతో బీసీసీఐ సస్పెక్టెడ్ బౌలర్స్ లిస్టులో చేర్చింది. కరియప్ప, సౌరవ్ దూబే కూడా ఈ జాబితాలో ఉన్నారు. మరోవైపు మనీశ్ పాండే, శ్రీజిత్ కృష్ణన్ బౌలింగ్‌పై బీసీసీఐ ఇప్పటికే నిషేధం విధించిందని సమాచారం. కాగా దీపక్ హుడా భారత్ తరఫున 10 వన్డేలు, 21 టీ20లకు ప్రాతినిధ్యం వహించారు. ఐపీఎల్‌లో 118 మ్యాచులు ఆడారు.
News November 22, 2024
పార్లమెంట్ సమావేశాల్లో వ్యూహాలపై చర్చ
AP: ఈ నెల 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ తమ పార్టీ ఎంపీలతో వేర్వేరుగా సమావేశం అయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాలు, రాష్ట్రాభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించారు. ఎంపీలకు సీఎం, పవన్ దిశానిర్దేశం చేశారు.
News November 22, 2024
గంభీర్ మాటలతో స్ఫూర్తి పొందాను: నితీశ్ రెడ్డి
బౌన్సర్ అయినా సరే తట్టుకుని నిలబడాలని కోచ్ గౌతమ్ గంభీర్ చెప్పిన మాటలు తనకు స్ఫూర్తినిచ్చాయని టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి తెలిపారు. ‘చివరి ప్రాక్టీస్ సెషన్ తర్వాత గౌతమ్ నాతో మాట్లాడారు. బౌన్సర్ వచ్చినప్పుడు దేశం కోసం తూటాకు అడ్డునిలబడినట్లే భావించాలని చెప్పారు. ఆ మాటలు నాలో నాటుకుపోయాయి. ఆయన్నుంచి నేను విన్న బెస్ట్ సలహా అది’ అని పేర్కొన్నారు.