News November 22, 2024

తెలుగు రాష్ట్రాలు గజగజ

image

తెలుగు రాష్ట్రాల్లో చలి విజృంభిస్తోంది. ఏపీలోని పాడేరు ఏజెన్సీలో పొగమంచు దట్టంగా అలుముకుంది. మినములూరులో అత్యల్పంగా 9, అరకులో 10, పాడేరు 11 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. అటు తెలంగాణలోని ఆదిలాబాద్ ఏజెన్సీలోనూ చలి చంపేస్తోంది. సిర్పూర్(యు)లో 10.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Similar News

News November 22, 2024

తిరుమల లడ్డూపై సిట్ విచారణ ప్రారంభం

image

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడటంపై సిట్ విచారణ ప్రారంభించింది. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేసి సీబీఐకి తుది నివేదిక ఇవ్వనుంది. ఈ బృందం తిరుపతి, తిరుమల, ఏఆర్ డెయిరీల్లో విచారణ చేయనుంది. నాలుగు టీమ్‌లుగా ఏర్పడి అన్ని అంశాలపై లోతుగా దర్యాప్తు చేయనుంది. ప్రస్తుతం సిట్ బృందానికి తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశారు.

News November 22, 2024

చితికి నిప్పంటిస్తుండగా లేచాడు.. కానీ..

image

రాజస్థాన్‌లో ఝున్‌ఝునూ జిల్లాకు చెందిన రోహితాశ్‌ ఓ అనాథ. అనారోగ్యంగా ఉన్నాడని షెల్టర్ హోమ్ సిబ్బంది నిన్న జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు అతడు చనిపోయాడని చెప్పి పంచనామా చేసి పంపించేశారు. శ్మశానంలో చితికి నిప్పంటించే సమయానికి అతడు కదలడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ICUలో కొన్ని గంటలపాటు బతికిన రోహితాశ్ తర్వాతి రోజు మరణించాడు. ఘటనలో ముగ్గురు వైద్యుల్ని కలెక్టర్ సస్పెండ్ చేశారు.

News November 22, 2024

దీపక్ హుడా బౌలింగ్‌పై నిషేధం?

image

టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ దీపక్ హుడా బౌలింగ్ శైలి అనుమానాస్పదంగా ఉండటంతో బీసీసీఐ సస్పెక్టెడ్ బౌలర్స్ లిస్టులో చేర్చింది. కరియప్ప, సౌరవ్ దూబే కూడా ఈ జాబితాలో ఉన్నారు. మరోవైపు మనీశ్ పాండే, శ్రీజిత్ కృష్ణన్ బౌలింగ్‌పై బీసీసీఐ ఇప్పటికే నిషేధం విధించిందని సమాచారం. కాగా దీపక్ హుడా భారత్ తరఫున 10 వన్డేలు, 21 టీ20లకు ప్రాతినిధ్యం వహించారు. ఐపీఎల్‌లో 118 మ్యాచులు ఆడారు.