News November 22, 2024
రిజిస్ట్రేషన్ విలువల సవరింపు వాయిదా
AP: ఆస్తుల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ విలువల సవరింపును రాష్ట్ర ప్రభుత్వం జనవరికి వాయిదా వేసింది. గత ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో విలువలను పెంచగా, వాటిని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే అభివృద్ధి ప్రాతిపదికన ఇతర చోట్ల పెంచనుంది. సవరించిన విలువలను తొలుత డిసెంబర్ 1 నుంచి అమల్లోకి తేవాలని భావించింది. కానీ విలువల నిర్ధారణకు మరింత సమయం పట్టే అవకాశం ఉండడంతో వాయిదా వేసింది.
Similar News
News November 22, 2024
బుమ్రా అందుకే సక్సెస్ అయ్యారు: స్టార్క్
భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ ప్రశంసలు కురిపించారు. అన్ని ఫార్మాట్లలోనూ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారని కొనియాడారు. ‘బుమ్రా బౌలింగ్ యాక్షన్ చాలా విభిన్నంగా హైపర్ ఎక్స్‌టెన్షన్‌తో ఉండటమే అతడి సక్సెస్‌కు కారణం. దానికి తన నైపుణ్యం కూడా తోడైంది. అలా బౌలింగ్ చేయడం చాలా కష్టం. నేనైతే ఆ శైలిలో బౌలింగ్ ప్రయత్నించను. నా చేయి విరిగిపోతుంది’ అని వ్యాఖ్యానించారు.
News November 22, 2024
ఇది రాబందు రాజ్యం: KTR
TG: కాంగ్రెస్ ప్రభుత్వం పిల్లలకు నాణ్యమైన ఆహారం కూడా అందించలేకపోతోందని కేటీఆర్ విమర్శించారు. ‘బడిమెట్లు ఎక్కిన బాల్యాన్ని ఆస్పత్రిలో చావు అంచున నిలిపినవ్. ఇది పేదల పిల్లలను పొడుచుకుతింటున్న రాబందు రాజ్యం. విషమ పరిస్థితిలో ఓ బిడ్డ 20 రోజులుగా తల్లడిల్లుతుంటే కనీసం పరామర్శించాలనే సోయి లేని సన్నాసి ప్రభుత్వమిది. ఈ విద్యార్థుల కన్నీళ్లు.. నీ రాక్షస పాలనకు సమాధిని నిర్మిస్తాయి’ అని ట్వీట్ చేశారు.
News November 22, 2024
తిరుమల లడ్డూపై సిట్ విచారణ ప్రారంభం
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడటంపై సిట్ విచారణ ప్రారంభించింది. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేసి సీబీఐకి తుది నివేదిక ఇవ్వనుంది. ఈ బృందం తిరుపతి, తిరుమల, ఏఆర్ డెయిరీల్లో విచారణ చేయనుంది. నాలుగు టీమ్‌లుగా ఏర్పడి అన్ని అంశాలపై లోతుగా దర్యాప్తు చేయనుంది. ప్రస్తుతం సిట్ బృందానికి తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశారు.