News November 22, 2024
‘హలో’ ఎలా వచ్చిందో తెలుసా?
ఫోన్ ఎత్తగానే ‘హలో’ అని పలకరిస్తుంటాం. అసలు ఈ పదం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ ప్రకారం హలో అనే పదం holla, hollo అనే రెండు పదాల నుంచి వచ్చింది. దూరంగా ఉన్న ఒక వ్యక్తిని పిలిచేందుకు ఈ పదాలను వాడతారు. బ్రిటిష్ జర్నలిస్టు బ్రిసన్ ప్రకారం ‘hale be thou’ అనే ఓల్డ్ ఇంగ్లిష్ ఫ్రేజ్ నుంచి తీసుకోగా, ‘ఆరోగ్యంగా ఉండాలని ఆశించడం’ దీని అర్థం. ‘హలో’ అనే పదాన్ని మాత్రం ఎడిసన్ సిఫారసు చేశారు.
Similar News
News November 22, 2024
చితికి నిప్పంటిస్తుండగా లేచాడు.. కానీ..
రాజస్థాన్‌లో ఝున్‌ఝునూ జిల్లాకు చెందిన రోహితాశ్ ఓ అనాథ. అనారోగ్యంగా ఉన్నాడని షెల్టర్ హోమ్ సిబ్బంది నిన్న జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు అతడు చనిపోయాడని చెప్పి పంచనామా చేసి పంపించేశారు. శ్మశానంలో చితికి నిప్పంటించే సమయానికి అతడు కదలడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ICUలో కొన్ని గంటలపాటు బతికిన రోహితాశ్ తర్వాతి రోజు మరణించాడు. ఘటనలో ముగ్గురు వైద్యుల్ని కలెక్టర్ సస్పెండ్ చేశారు.
News November 22, 2024
దీపక్ హుడా బౌలింగ్‌పై నిషేధం?
టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ దీపక్ హుడా బౌలింగ్ శైలి అనుమానాస్పదంగా ఉండటంతో బీసీసీఐ సస్పెక్టెడ్ బౌలర్స్ లిస్టులో చేర్చింది. కరియప్ప, సౌరవ్ దూబే కూడా ఈ జాబితాలో ఉన్నారు. మరోవైపు మనీశ్ పాండే, శ్రీజిత్ కృష్ణన్ బౌలింగ్‌పై బీసీసీఐ ఇప్పటికే నిషేధం విధించిందని సమాచారం. కాగా దీపక్ హుడా భారత్ తరఫున 10 వన్డేలు, 21 టీ20లకు ప్రాతినిధ్యం వహించారు. ఐపీఎల్‌లో 118 మ్యాచులు ఆడారు.
News November 22, 2024
పార్లమెంట్ సమావేశాల్లో వ్యూహాలపై చర్చ
AP: ఈ నెల 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ తమ పార్టీ ఎంపీలతో వేర్వేరుగా సమావేశం అయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాలు, రాష్ట్రాభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించారు. ఎంపీలకు సీఎం, పవన్ దిశానిర్దేశం చేశారు.