News November 22, 2024

అదానీపై అభియోగాలు: వైట్‌హౌస్ ఏం చెప్పిందంటే..

image

గౌతమ్ అదానీపై నమోదైన అభియోగాలపై అవగాహన ఉందని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జేన్ పియరీ తెలిపారు. ఆరోపణలపై మరింత సమాచారం కావాలంటే SEC, DOJను సంప్రదించాలని సూచించారు. ఈ వివాదంతో భారత్, అమెరికా మధ్య విభేదాలేమీ ఏర్పడవని ధీమా వ్యక్తం చేశారు. రెండు దేశాల సంబంధాలు బలమైన పునాదులపై నిర్మించారని, గ్లోబల్ ఇష్యూస్‌పై పూర్తి స్థాయి పరస్పర సహకారం ఉంటుందన్నారు. ఈ వివాదాన్ని నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు.

Similar News

News November 22, 2024

ఇది రాబందు రాజ్యం: KTR

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం పిల్లలకు నాణ్యమైన ఆహారం కూడా అందించలేకపోతోందని కేటీఆర్ విమర్శించారు. ‘బడిమెట్లు ఎక్కిన బాల్యాన్ని ఆస్పత్రిలో చావు అంచున నిలిపినవ్. ఇది పేదల పిల్లలను పొడుచుకుతింటున్న రాబందు రాజ్యం. విషమ పరిస్థితిలో ఓ బిడ్డ 20 రోజులుగా తల్లడిల్లుతుంటే కనీసం పరామర్శించాలనే సోయి లేని సన్నాసి ప్రభుత్వమిది. ఈ విద్యార్థుల కన్నీళ్లు.. నీ రాక్షస పాలనకు సమాధిని నిర్మిస్తాయి’ అని ట్వీట్ చేశారు.

News November 22, 2024

తిరుమల లడ్డూపై సిట్ విచారణ ప్రారంభం

image

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడటంపై సిట్ విచారణ ప్రారంభించింది. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేసి సీబీఐకి తుది నివేదిక ఇవ్వనుంది. ఈ బృందం తిరుపతి, తిరుమల, ఏఆర్ డెయిరీల్లో విచారణ చేయనుంది. నాలుగు టీమ్‌లుగా ఏర్పడి అన్ని అంశాలపై లోతుగా దర్యాప్తు చేయనుంది. ప్రస్తుతం సిట్ బృందానికి తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశారు.

News November 22, 2024

చితికి నిప్పంటిస్తుండగా లేచాడు.. కానీ..

image

రాజస్థాన్‌లో ఝున్‌ఝునూ జిల్లాకు చెందిన రోహితాశ్‌ ఓ అనాథ. అనారోగ్యంగా ఉన్నాడని షెల్టర్ హోమ్ సిబ్బంది నిన్న జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు అతడు చనిపోయాడని చెప్పి పంచనామా చేసి పంపించేశారు. శ్మశానంలో చితికి నిప్పంటించే సమయానికి అతడు కదలడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ICUలో కొన్ని గంటలపాటు బతికిన రోహితాశ్ తర్వాతి రోజు మరణించాడు. ఘటనలో ముగ్గురు వైద్యుల్ని కలెక్టర్ సస్పెండ్ చేశారు.