News November 22, 2024
మంచు తెరల్లో పొద్దుతిరుగుడు అందాలు

ఇదేదో గ్రాఫిక్స్ ఫొటో..లేదా వాల్ పేపర్ ఫొటో అనుకుంటే మీ పొరపాటే.! డుంబ్రిగూడ మండలంలోని జంగిడివలస రైల్వే గేటు సమీపంలో స్థానిక గిరిజనులు వేసిన పొద్దుతిరుగుడు పువ్వుల పంట ఇది. ఒకపక్క ఆహ్లాదకరమైన మంచు తెరలు.. మరోపక్క ఆకర్షించే ఈ పొద్దుతిరుగుడు పువ్వుల అందాలు ప్రకృతి ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. మైదాన ప్రాంతానికి చెందిన పర్యాటకులు ఈ అద్భుతమైన దృశ్యాలను చూసి ఫిదా అవుతున్నారు.
Similar News
News February 28, 2026
విశాఖలో నేటి నుంచి సెలబ్రిటీ క్రికెట్ లీగ్

విశాఖలో ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో నేటి నుంచి రెండు రోజుల పాటు ‘టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్’ (TCCL) ప్రారంభం కానుంది. సినీ నటులు శ్రీకాంత్, తరుణ్ నేతృత్వంలో సుమారు 110 మంది సినీ, టీవీ ప్రముఖులు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. పేద విద్యార్థుల చదువులకు చేయూతనిచ్చే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ మ్యాచ్‌లకు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పించారు.
News February 28, 2026
విశాఖ: కేంద్ర కారాగారాన్ని సందర్శించిన జైళ్ల శాఖ ఐజీ

విశాఖ కేంద్ర కారాగారాన్ని జైళ్ల శాఖ ఐజీ ఇండ్ల శ్రీనివాసరావు సందర్శిచారు. ఏపీ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ బిల్లు-2026 అసెంబ్లీలో ప్రవేశపెట్టామని, గవర్నర్ ఆమోదం వెంటనే చట్టమవుతుందని తెలిపారు. జైళ్ల అభివృద్ధికి రూ.102 కోట్లు కేటాయించి, తొలి విడతగా రూ.53 కోట్లతో బ్యారక్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మూడు రోజుల శిక్షణ ముగింపులో అధికారులకు సర్టిఫికెట్లు అందజేశారు.
News February 27, 2026
హోలీ పండుగ రద్దీ దృష్ట్యా విశాఖ- పాట్నా మధ్య ప్రత్యేక రైళ్లు

హోలీ పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం – పాట్నా మధ్య రెండు ప్రత్యేక రైళ్లను (08537/08538) నడపాలని వాల్తేరు రైల్వే విభాగం నిర్ణయించింది. మార్చి 1, 8 తేదీల్లో విశాఖ నుంచి, మార్చి 2, 9 తేదీల్లో పాట్నా నుంచి ఈ రైళ్లు బయలుదేరుతాయి. విజయనగరం, బొబ్బిలి, రాయగడ మీదుగా నడిచే ఈ రైలు సర్వీసులను ప్రయాణికులు వినియోగించుకోవాలని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్ కుమార్ కోరారు.


