News November 22, 2024

మణిపుర్‌లో మీ చిదంబరం చేసింది మర్చిపోయారా: ఖర్గేపై నడ్డా ఫైర్

image

మణిపుర్ పరిస్థితిని కాంగ్రెస్ సెన్సేషనల్ చేయడానికి పదేపదే ప్రయత్నించడం షాకింగ్‌గా ఉందని BJP చీఫ్ జేపీ నడ్డా అన్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే లేఖ రాయడంపై మండిపడ్డారు. ‘విదేశీ మిలిటెంట్ల అక్రమ వలసల్ని చట్టబద్ధం చేసింది, వారితో ఒప్పందాలు కుదుర్చుకున్నదే అప్పటి HM, మీ చిదంబరం అని మర్చిపోయారేమో. దేశాన్ని అస్థిరపరిచే విదేశీ శక్తులకు మీరు వత్తాసు పలకడం ఆందోళనకరం’ అని అన్నారు.

Similar News

News November 22, 2024

చెట్లు నరికేయకుండా కర్ర వాడుకోవచ్చు!

image

పచ్చదనాన్ని పరిరక్షించేందుకు జపాన్ ప్రభుత్వం పాటిస్తోన్న పద్ధతిని నెటిజన్లు అభినందిస్తున్నారు. అక్కడ చెట్లను నరకకుండానే కలపను పొందుతుంటారు. అది ఎలా అనుకుంటున్నారా? దైసుగి అనే పురాతన ప్రక్రియలో ఉత్తమమైన దేవదారు వృక్షాలను ఎంపిక చేస్తారు. పొడవుగా పెరిగేందుకు పైన కొమ్మలను కట్ చేస్తుంటారు. ఏపుగా పెరిగిన వృక్షాలను పైనుంచి కత్తిరించి చెక్కను వాడుకుంటారు.

News November 22, 2024

అదానీ లంచాల వ్యవహారం: స్పందించిన తమిళ సర్కారు

image

Adani Groupతో త‌మ‌కు ఎలాంటి ప్ర‌త్య‌క్ష బంధాలు లేవ‌ని తమిళనాడు ప్ర‌భుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన SECIతో 2021లో యూనిట్‌ ₹2.61తో 1,500MW Solar Power 25 ఏళ్లపాటు కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రి సెంథిల్ తెలిపారు. అవినీతిమ‌య‌మైన గ్రూప్‌ను BJP ఎందుకు స‌మ‌ర్థిస్తోంద‌ని DMK ప్ర‌తినిధి శ‌ర‌వ‌ణ‌న్ ప్ర‌శ్నించారు. అదానీపై విచార‌ణ జరిపించే దమ్ముందా అని BJPకి సవాల్ విసిరారు.

News November 22, 2024

మమ్మల్ని రెచ్చగొట్టకండి: రష్యా హెచ్చరిక

image

ఉక్రెయిన్‌కు సాయం చేయడం మానుకోవాలని పశ్చిమ దేశాలకు రష్యా తాజాగా సూచించింది. తమను రెచ్చగొట్టొద్దని పేర్కొంది. ‘మా గడ్డపై జరిగే దాడుల్లో పశ్చిమ దేశాలు జోక్యం చేసుకోవద్దు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేయొద్దు. మీ వైఖరి ఇలాగే కొనసాగితే ఉక్రెయిన్‌పై మరిన్ని క్షిపణి దాడులు చేస్తాం’ అని హెచ్చరించింది. ఉక్రెయిన్‌లో జనావాసాల మీదకు రష్యా బాలిస్టిక్ క్షిపణి దాడి చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.