News November 22, 2024
బోనస్ మాట బోగస్ అయింది: హరీశ్ రావు
TG: ఈనాం కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. రూ.500 బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ మాట బోగస్ అయిందని ఖమ్మం పత్తి మార్కెట్లో ఆరోపించారు. జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా రైతుల సమస్యలపై సమీక్ష చేసే తీరిక లేదన్నారు. పెట్టుబడి సాయం ఇవ్వకపోగా మద్దతు ధర లేదని, రైతులకు రుణమాఫీ చేయలేదని ఆరోపించారు. ప్రతిపక్షాలపై కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని హరీశ్ రావు విమర్శించారు.
Similar News
News November 22, 2024
ఛాంపియన్స్ ట్రోఫీపై 26న ICC అత్యవసర సమావేశం
వచ్చే ఏడాది పాక్‌లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో అనిశ్చితి నెలకొనడంతో ఐసీసీ ఈ నెల 26న అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. బీసీసీఐ, పీసీబీ పెద్దలు ఇందులో పాల్గొంటారు. భద్రతాకారణాల రీత్యా పాక్‌కు క్రికెటర్లను పంపేదే లేదని భారత్ చెబుతుండగా, పంపాల్సిందేనని పాక్ పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో ఐసీసీ రెండింటి మధ్య సయోధ్యకు యత్నిస్తోంది.
News November 22, 2024
మరోసారి తల్లి కాబోతున్న హీరోయిన్
హీరోయిన్ సనా ఖాన్ మరోసారి తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ముగ్గురం నలుగురం కాబోతున్నాం అని పేర్కొన్నారు. 2005లో ‘యేహై హై సొసైటీ’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సనా ఖాన్.. కళ్యాణ్ రామ్ ‘కత్తి’ మూవీతో తెలుగులో అరంగేట్రం చేశారు. తెలుగులో గగనం, మిస్టర్ నూకయ్య లాంటి చిత్రాల్లో నటించారు. 2020లో ముస్లిం మతగురువు అనాస్ సయ్యద్‌ను పెళ్లి చేసుకోగా 2023లో పాప జన్మించింది.
News November 22, 2024
ఫిల్ హ్యూస్ జ్ఞాపకార్థం క్రికెట్ ఆస్ట్రేలియా కార్యక్రమాలు
క్రికెట్ బాల్ తగిలి ఫిల్ హ్యూస్ కన్నుమూసి పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో అతడి జ్ఞాపకార్థం క్రికెట్ ఆస్ట్రేలియా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. వచ్చే 3 షెఫీల్డ్ షీల్డ్ మ్యాచుల్లో ఆటగాళ్లు నల్ల బ్యాండ్స్ ధరిస్తారని తెలిపింది. 2014లో సౌత్ ఆస్ట్రేలియా తరఫున ఆడుతున్న సమయంలో షాన్ అబాట్ వేసిన బంతి హ్యూస్ ఎడమ చెవి కింద తగిలింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ నవంబరు 27న కన్నుమూశారు.