News November 22, 2024

టెట్ అభ్యర్థులకు అలర్ట్.. నేడే లాస్ట్

image

TG: టెట్‌ అభ్యర్థులకు దరఖాస్తులు ఎడిట్ చేసుకునే అవకాశం నేటితో ముగియనుంది. బుధవారమే దరఖాస్తు ప్రక్రియ ముగియగా తప్పులను సరిచేసుకోవడానికి ఈ నెల 22 వరకు ఎడిట్ ఆప్షన్ కల్పించారు. ఇదిలా ఉంటే కొన్ని ప్రాంతాల్లో సర్వర్లు డౌన్ కావడంతో తాము అప్లై చేసుకోలేకపోయామని, దరఖాస్తు గడువు పెంచాలని కొందరు కోరుతున్నారు.

Similar News

News November 6, 2025

నా పిల్లలు చనిపోవాలని వాళ్లు కోరుకుంటున్నారు: చిన్మయి

image

SMలో అబ్యూస్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ట్విట్టర్ స్పేస్‌లో మహిళలను కించపరుస్తూ బూతులు తిట్టడాన్ని ఆమె ఖండించారు. ‘రోజూ అవమానాలతో విసిగిపోయాం. TGలో మహిళలకు మరింత గౌరవం దక్కాలి. నా పిల్లలు చనిపోవాలని వీళ్లు కోరుకుంటున్నారు. 15 ఏళ్లైనా పర్వాలేదు నేను పోరాడతా. సజ్జనార్ సార్ సహాయం చేయండి’ అని ట్వీట్ చేశారు. ఈ వివాదం ఏంటో పరిశీలించాలని సజ్జనార్ సైబర్ క్రైమ్ పోలీసులకు సూచించారు.

News November 6, 2025

నవంబర్ 6: చరిత్రలో ఈరోజు

image

* 1913: మహాత్మా గాంధీని దక్షిణాఫ్రికాలో అరెస్ట్ చేశారు
* 1940: గాయని, రచయిత శూలమంగళం రాజ్యలక్ష్మి జననం
* 1951: భారత మొదటి ప్రధాన న్యాయమూర్తి హీరాలాల్ జెకిసుందాస్ కనియా మరణం
* 1985: బాలీవుడ్ నటుడు సంజీవ్ కుమార్ మరణం(ఫొటోలో)
* పర్యావరణ దోపిడీని నిరోధించే దినోత్సవం

News November 6, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.