News November 22, 2024

విమర్శలపై స్పందించిన కొండా సురేఖ

image

TG: ఎన్ని విమర్శలు, ఆరోపణలొచ్చినా ప్రజలపై తన ప్రేమను, సేవాభావాన్ని తగ్గించలేవని మంత్రి కొండా సురేఖ అన్నారు. కొన్ని దుష్టదుర్మార్గ శక్తులు ఎన్ని అడ్డంకులను సృష్టించినా అనుక్షణం జనమే మనమంటూ ముందుకు కదులుతానని ట్వీట్ చేశారు. ఆమె <<14675277>>వీడియో<<>> ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతున్న నేపథ్యంలోనే మంత్రి ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.

Similar News

News November 23, 2024

తెలంగాణలో 13 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలకు పర్మిషన్

image

తెలంగాణలో 13 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటికే ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా 13 గవర్నమెంట్ నర్సింగ్ కళాశాలలు రానున్నాయి. ఒక్కో కాలేజీకి 60 మంది విద్యార్థులను తీసుకోనున్నారు. జనగాం, భూపాలపల్లి, కరీంనగర్, ఆసిఫాబాద్, నిర్మల్, రామగుండం, మెదక్, కుత్బుల్లాపూర్, ములుగు, నారాయణపేట, మహేశ్వరం, నర్సంపేట, భువనగిరిలో కాలేజీలు ఏర్పాటుకానున్నాయి.

News November 23, 2024

చలి పులి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

image

తెలుగు రాష్ట్రాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో చలి తీవ్రంగా పెరిగిపోయింది. ఈ సీజన్‌లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. సరిపడా నీరు, పౌష్ఠికాహారం తీసుకోవాలి. జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. విటమిన్ C ఉండే ఫుడ్ తీసుకోవాలి. చలి మంట కోసం ఇంట్లో కర్రలు కాల్చకూడదు. ఇలా చేస్తే కార్బన్ మోనాక్సైడ్ పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

News November 22, 2024

రేపే ఫలితాలు.. WAY2NEWSలో వేగంగా..

image

మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలను వే2న్యూస్ యాప్‌లో వేగంగా చూడొచ్చు. శనివారం ఉదయం 8 గంటల నుంచి నాన్-స్టాప్ కవరేజ్ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫలితాలతో పాటు స్పెషల్ గ్రాఫిక్ ప్లేట్స్, విశ్లేషణాత్మక స్టోరీలు అందుబాటులో ఉంటాయి. మహారాష్ట్రలో 288, ఝార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉ.9 గంటల కల్లా ఫలితాల సరళి తెలిసే అవకాశం ఉంది.