News November 22, 2024

తేనెకు అందుకే ఎక్స్‌పైరీ ఉండదు!

image

ఏ వస్తువుకైనా ఎక్స్‌పైరీ తేదీని చూసేవారు తేనెకు చూడరు. ఎందుకంటే అది పాడవదు. స్వచ్ఛమైన తేనె దశాబ్దాలైనా పాడవదని పెద్దలు చెప్తుంటారు. ఎందుకో ఆలోచించారా? ‘తేనెలో ఉండే 17శాతం నీరు దీనిని చెడిపోకుండా చేస్తుంది. తక్కువ నీటి శాతం బ్యాక్టీరియాను నిర్జలీకరణం చేస్తుంది. దీంతో చెడిపోదు. ఆమ్లత్వం కూడా 3.9శాతం ఉండటం మరో కారణం. తేమను పీల్చుకునే సామర్థ్యం తేనెకు ఉండటం కూడా ఓ కారణమే’ అని నిపుణులు చెబుతున్నారు.

Similar News

News November 23, 2024

పురుగుల మందు పీల్చి 100కి పైగా కోతుల మృతి

image

UPలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ ఆహార నిల్వల గోడౌన్‌లో పురుగుల మందు స్ప్రే చేయగా కిటికీ నుంచి లోపలికి వెళ్లిన 100కి పైగా కోతులు దాన్ని పీల్చడం వల్ల చనిపోయాయి. గోడౌన్ నిర్వాహకులు గుట్టుగా వాటన్నింటినీ ఓ గోతిలో ఖననం చేశారు. స్థానిక విశ్వహిందూ పరిషత్ నేతలు పోలీసులకు సమాచారమివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కోతుల్ని వెలికి తీశామని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

News November 23, 2024

పుష్ప-2 నుంచి ‘కిస్సిక్’ టీజర్.. ఎప్పుడంటే..

image

పుష్ప-2 నుంచి కిస్సిక్ సాంగ్ ఈ నెల 24న సాయంత్రం 7.02 గంటలకు విడుదల కానుంది. అంతకంటే ముందు మూవీ టీమ్ ఆడియన్స్‌కు సర్‌ప్రైజ్ ప్లాన్ చేసింది. రేపు ఉదయం 10.08 గంటలకు సాంగ్ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటలో అల్లు అర్జున్ సరసన శ్రీలీల డాన్స్ చేశారు.

News November 23, 2024

తెలంగాణలో 13 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలకు పర్మిషన్

image

తెలంగాణలో 13 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటికే ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా 13 గవర్నమెంట్ నర్సింగ్ కళాశాలలు రానున్నాయి. ఒక్కో కాలేజీకి 60 మంది విద్యార్థులను తీసుకోనున్నారు. జనగాం, భూపాలపల్లి, కరీంనగర్, ఆసిఫాబాద్, నిర్మల్, రామగుండం, మెదక్, కుత్బుల్లాపూర్, ములుగు, నారాయణపేట, మహేశ్వరం, నర్సంపేట, భువనగిరిలో కాలేజీలు ఏర్పాటుకానున్నాయి.