News November 22, 2024

BREAKING: భారత్ ఆలౌట్

image

BGT: తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో భారత్ 150 రన్స్‌కే ఆలౌటైంది. తెలుగు క్రికెటర్ నితీశ్‌రెడ్డి 41 పరుగులతో పోరాడారు. పంత్(37), రాహుల్(26) కుదురుకున్నట్లు కనిపించినా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. జైస్వాల్(0), పడిక్కల్(0), కోహ్లీ(5), జురెల్(11), సుందర్(4), రాణా(7) బుమ్రా(8) నిరాశపర్చారు. హేజిల్‌వుడ్ 4, స్టార్క్ 2, మార్ష్ 2, కమిన్స్ 2 వికెట్లు తీశారు.

Similar News

News November 6, 2025

గ్రాముకు రూ.9వేల లాభం

image

RBI తీసుకొచ్చిన సావరిన్ గోల్డ్ బాండ్స్(SGB) మదుపర్లకు భారీ లాభాలను అందించాయి. 2017 NOV 6న విడుదల చేసిన సిరీస్‌-VI బాండ్లకు అప్పట్లో గ్రాము ₹2,895గా(ఆన్‌లైన్‌లో ₹50 డిస్కౌంట్) నిర్ణయించారు. 8 ఏళ్ల కాలవ్యవధి పూర్తికావడంతో ఆ బాండ్లు మెచ్యూరిటీకి వచ్చాయి. ప్రస్తుతం వాటి ధరను ₹12,066గా RBI నిర్ణయించింది. అంటే ఒక్కో గ్రాముపై ₹9,121 లాభం వచ్చింది. దీనికి ఏటా చెల్లించే 2.5% వడ్డీ అదనం.

News November 6, 2025

T20WC-2026 వేదికలు ఖరారు!

image

ICC మెన్స్ T20WC-2026 వేదికలు దాదాపు ఖరారయ్యాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, అహ్మదాబాద్‌, చెన్నైలో మ్యాచ్‌లు జరిగే అవకాశముంది. పాక్ మ్యాచ్‌లను కొలంబోలో నిర్వహిస్తారు. అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో ఫైనల్ నిర్వహణకు కసరత్తు జరుగుతోంది. మొత్తం 20 టీమ్స్ 4 గ్రూపుల్లో ఆడతాయి. ప్రతి గ్రూపులోని టాప్-2 జట్లు సూపర్-8కి చేరతాయి. ఇక్కడ 2 గ్రూపులుగా విడిపోయి మ్యాచ్‌లు ఆడతాయి. ఇందులో టాప్-2 జట్లు సెమీస్‌కు వెళతాయి.

News November 6, 2025

పసుపులో ముర్రాకు తెగులు, దుంపకుళ్లు.. నివారణకు సూచనలు

image

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పసుపు పంటలో ముర్రాకు తెగులు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఇది కొన్ని రోజుల్లోనే పొలమంతా విస్తరిస్తుంది. అందుకే తెగులు ఆశించిన ఆకులను తుంచి కాల్చివేయాలి. థయోఫానైట్ మిథైల్ 2 గ్రా. లేదా ప్రొపికొనజోల్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి ఆకులు బాగా తడిచేలా పిచికారీ చేయాలి. అలాగే దుంపకుళ్లు నివారణకు లీటరు నీటికి మెటలాక్సిల్+మ్యాంకోజెబ్ 3గ్రా. చొప్పున కలిపి మొక్కల మొదళ్లను తడపాలి.