News November 22, 2024
HYD: హైకోర్టులో మరో పిటిషన్ వేసిన మాజీ ఎమ్మెల్యే

మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. లగచర్ల ఘటనలో మూడు కేసులు నమోదు చేసి మూడు FIRలు చేశారంటూ పిటిషన్ వేశారు. ఒకే ఘటనలో మూడు FIRలు ఎలా చేస్తారంటూ ప్రభుత్వ లాయర్‌ను హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనిపై పోలీసుల వద్ద నుంచి వివరాలు సేకరించి కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వ లాయర్‌ను హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.
Similar News
News November 8, 2025
ఖైరతాబాద్: సాగర తీరంలో సీఎం సైకత చిత్రం

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శనివారం హుస్సేన్‌సాగర్ తీరంలోని ఎన్టీఆర్ మార్గ్‌లో శాండ్ ఆర్ట్‌తో ఆయన చిత్రాన్ని రూపొందించారు. ఖైరతాబాద్ కార్పొరేటర్ పి.విజయారెడ్డి ఆధ్వర్యంలో సైకత శిల్పి ఆకునూరి బాలాజీ వరప్రసాద్ తీర్చిదిద్దారు. నెల్లూరు నుంచి తెప్పించిన 40 టన్నుల ఇసుకను ఉపయోగించి రేవంత్ చిత్రాన్ని 24 గంటలపాటు శ్రమించి రూపొందించారు. ఈ నెల 15వరకు ఈ ఆర్ట్ ఉంటుంది.
News November 8, 2025
జూబ్లీ బై పోల్: రేపటి నుంచి పోలీసుల తనిఖీలు

ఉపఎన్నిక ప్రచారం రేపు సా.5 గంటలకు ముగియనుంది. ఆ తర్వాత స్థానికేతరులు ఎవ్వరూ నియోజకవర్గంలో ఉండరాదు. ఈ నిబంధనలు అతిక్రమిస్తే ఈసీ కఠిన చర్యలు తీసుకుంటుంది. అందుకే రేపు సాయంత్రం తర్వాత పోలీసులు నియోజకవర్గంలో ఉన్న ఫంక్షన్ హాళ్లు, గెస్ట్ హౌసులు, లాడ్జీలలో తనిఖీలు చేపడతారని ఎన్నికల అధికారి సాయిరాం తెలిపారు.
News November 8, 2025
జూబ్లీహిల్స్: ఓట్ల కోసం ఇంతకి దిగజారుతారా?: BRS

దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీతపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ తప్పుబట్టింది. సునీత.. గోపీనాథ్ 3వ, 4వ భార్యనా అని అనుమానిస్తున్నారు.. ఉపఎన్నికలో ఓట్ల కోసం కాంగ్రెస్ ఓ మహిళపై దిగజారి మాట్లాడాలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఈ విషయం స్పందించాలని, ఈ వ్యాఖ్యలు చేసిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు.


