News November 22, 2024

సంక్రాంతి లోపు పనులు పూర్తి చేస్తాం: పవన్ కళ్యాణ్

image

AP: NREGS ద్వారా రూ.4,500 కోట్లతో 30వేల పనులు చేపట్టినట్లు డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ తెలిపారు. సంక్రాంతి లోపు ఆ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ఉపాధి పథకం నిధుల మళ్లింపు, జాబ్‌ కార్డుల్లో అవకతవకలు జరిగాయని MLAలు సభ దృష్టికి తీసుకురాగా, వాటిపై విచారణ చేస్తామని పవన్ ప్రకటించారు. ఉపాధి హామీ కింద కాలువల్లో పూడిక, గుర్రపుడెక్క తొలగింపు, శ్మశానవాటికల ప్రహరీల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News January 20, 2026

వెంకీ ‘AK-47’లో నారా రోహిత్?

image

విక్టరీ వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘ఆదర్శ కుటుంబం’(AK-47)లో హీరో నారా రోహిత్ నటిస్తారని తెలుస్తోంది. విలన్ షేడ్స్ ఉన్న పోలీస్ రోల్‌లో ఆయన కనిపిస్తారని సమాచారం. ఇప్పటికే మూవీ షూటింగ్ కొనసాగుతుండగా రోహిత్ పాల్గొన్నారని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. సమ్మర్‌లో రిలీజ్ చేస్తామని ప్రకటించినా విడుదల తేదీ మారుస్తారని టాక్.

News January 20, 2026

చలికాలంలో జుట్టూడకుండా ఉండాలంటే..

image

మిగతా సీజన్​లతో పోలిస్తే చలికాలంలో జుట్టు సమస్యలు ఎక్కువ. కాబట్టి జుట్టు సంరక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. తలస్నానానికి గోరువెచ్చటి నీటినే వాడాలి. తర్వాత కండీషనర్ మర్చిపోకూడదు. జుట్టు త్వరగా ఆరడానికి బ్లో డ్రైయ్యర్స్ వాడటం తగ్గించాలని సూచిస్తున్నారు. ఈ సీజన్​లో వెంట్రుకలకు ఎంత తరచుగా ఆయిల్ పెడితే అంత మంచిది. తేమ శాతం నిలిచి జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుందంటున్నారు.

News January 20, 2026

స్టార్ హోటళ్లు, రిసార్టులతో టూరిస్ట్ హబ్‌గా విశాఖ

image

AP: స్టార్ హోటళ్లు, లగ్జరీ రిసార్టులతో టూరిస్ట్ హబ్‌గా విశాఖ మారుతోంది. నగరంలో ₹1552 కోట్లతో 10 హోటళ్లు, రిసార్టులు నిర్మాణం కానున్నాయి. ITC ₹328 కోట్లతో హోటల్ నిర్మిస్తుండగా, అన్నవరం బీచ్, విమానాశ్రయానికి సమీపంలో Oberoi సంస్థ 7-స్టార్ లగ్జరీ రిసార్ట్, హోటల్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తోంది. వరుణ్ గ్రూపు కూడా హోటల్ నిర్మిస్తోంది. వీటితో పర్యాటకులను ఆకర్షించడంతోపాటు వేలాది మందికి ఉపాధి దక్కనుంది.