News November 22, 2024

ఓ హీరో ఛాన్స్ అడిగాడు, చెప్పుతో కొడతానని చెప్పా: ఖుష్బూ

image

అప్పట్లో ఓ హీరో తనకు ఛాన్స్ ఇవ్వమని అడిగారని నటి ఖుష్బూ సుందర్ తెలిపారు. గోవాలో జరుగుతున్న ఇఫ్ఫీ వేడుకల్లో ఆమె మాట్లాడారు. ‘కెరీర్ తొలినాళ్లలో ఓ సినిమా సెట్స్‌లో ఉన్నప్పుడు హీరో నా దగ్గరికి వచ్చాడు. నాకు ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా అని అడిగాడు. నా చెప్పు సైజు 41. ఇక్కడే కొట్టాలా.. యూనిట్ అందరి ముందూ కొట్టాలా అని ఎదురుతిరిగా. అన్నిటికన్నా ఆత్మగౌరవమే ముఖ్యం’ అని ఆమె చెప్పుకొచ్చారు.

Similar News

News December 26, 2025

స్వయంకృషి: ట్రెండ్ మారింది.. టైలర్ Boutique

image

లేడీస్ టైలర్ షాపులు ఇప్పుడు ట్రెండ్‌కు తగ్గట్టు స్కిల్స్, ఫీచర్స్ అప్డేట్ చేసుకుని బొటీక్స్‌గా మారుతున్నాయి. డిమాండ్ కూడా విపరీతంగా ఉంటోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే ఈ ఫ్యాషన్ స్టోర్‌కు టైమ్, స్కిల్, కొత్త డిజైన్లు చేయగల క్రియేటివిటీనే ప్రధాన ఖర్చు. మీకు తెలిసిన వారిని బొటీక్ గురించి అడిగి చూడండి. వారి వద్ద రేట్స్, డిమాండ్, చేసే పని మీకే అర్థమవుతుంది.
-రోజూ 1pmకు ఓ బిజినెస్ ఐడియా

News December 26, 2025

ఇండియన్ మ్యూజియంలో ఉద్యోగాలు

image

కోల్‌కతాలోని ఇండియన్ మ్యూజియంలో 3 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డిప్లొమా, డిగ్రీ( జర్నలిజం& మాస్ కమ్యూనికేషన్/ మీడియా సైన్స్/ఫైన్ ఆర్ట్స్/విజువల్ ఆర్ట్స్) అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు జనవరి 2 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 4ఏళ్లు. జీతం నెలకు రూ.35వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://indianmuseumkolkata.org

News December 26, 2025

వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజ

image

వైకుంఠ ద్వారాలు తెరుచుకునే పవిత్ర పర్వదినాన శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందాలనుకుంటున్నారా? మీ ఆర్థిక, కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభించి, సకల ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నారా? అయితే మీకు వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజ ఉత్తమమైనది. మీ పేరు, గోత్రనామాలతో జరిపించే సంకల్ప పూజ ద్వారా పాప విముక్తి పొంది, మోక్ష మార్గంలో పయనించవచ్చు. ఇప్పుడే వేదమందిర్‌లో మీ పూజను<> బుక్ చేసుకోండి<<>>.