News November 22, 2024

అసెంబ్లీ నిరవధిక వాయిదా

image

AP: రాష్ట్ర అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. 10 రోజులపాటు కొనసాగిన సభలో మొత్తం 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం లభించింది. 75 ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. మొత్తం 59 గంటల 57 నిమిషాల పాటు సభ కొనసాగింది. ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు వైసీపీ ఈ సమావేశాలను బహిష్కరించింది.

Similar News

News November 23, 2024

దేశంలో రైల్వేస్టేషన్ లేని ఏకైక రాష్ట్రం ఇదే

image

దేశంలోని ప్రతీ రాష్ట్రంలో రైల్వే లైన్ ఉంది. సిక్కింలో మాత్రం రైల్వే సౌకర్యం లేదు. అక్కడి ప్రతికూల వాతావరణమే ఇందుకు కారణం. నిటారుగా ఉండే లోయలు, ఇరుకైన మార్గాలు, ఎత్తైన పర్వతాల వల్ల రైల్వే లైన్లు నిర్మించడం కుదరదు. పైగా ఇక్కడ తరచూ కొండ చరియలు విరిగిపడతాయి. రాష్ట్రంలో ఎన్ని టూరిజం స్పాట్‌లు ఉన్నా రైల్వే సౌకర్యం లేక ఆదరణ తగ్గుతోంది. ఇటీవలే రంగ్‌పో రైల్వే స్టేషన్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.

News November 23, 2024

‘రెహమాన్‌తో బంధం’ వార్తలపై స్పందించిన మోహిని

image

AR రెహమాన్ దంపతులు విడాకులు ప్రకటించిన కాసేపటికే తన భర్త నుంచి విడిపోతున్నట్లు <<14674232>>బాసిస్ట్ మోహిని<<>> వెల్లడించారు. దీంతో ఇద్దరికీ మధ్య ఏదో ఉందంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. వాటిపై మోహిని తన ఇన్‌స్టాలో పరోక్షంగా స్పందించారు. ‘ఇంటర్వ్యూ కావాలంటూ భారీగా విజ్ఞప్తులు వస్తున్నాయి. ఎందుకో నాకు తెలుసు. ఈ చెత్తకు ప్రచారమివ్వాలన్న ఆసక్తి ఏమాత్రం లేదు. నా శక్తిని రూమర్స్‌పై పెట్టదలచుకోలేదు’ అని స్పష్టం చేశారు.

News November 23, 2024

ఆన్‌లైన్ మోటార్ బీమాలో మారుతీ, హ్యుందాయ్ హవా

image

ఆన్‌లైన్ మోటార్ బీమాలో మారుతీ, హ్యుందాయ్ సంస్థలు దూసుకెళ్తున్నాయని పాలసీబజార్ నివేదిక తాజాగా వెల్లడించింది. వాగన్ఆర్(5.9శాతం), స్విఫ్ట్(5.9), ఐ20(4.4), బలేనో(4.3), ఆల్టో(4.2శాతం) మార్కెట్లో మంచి వాటా దక్కించుకున్నాయని పేర్కొంది. ఇక EVల ఆన్‌లైన్ ఇన్సూరెన్స్‌లో 2022లో 423శాతం, గత ఏడాది 399శాతం పెరుగుదల నమోదైందని తెలిపింది. బీమా కొనుగోలుదారుల్లో అత్యధికులు 25 నుంచి 40 ఏళ్ల మధ్యవారేనని వివరించింది.