News November 22, 2024
OTTలోకి కొత్త సినిమా
కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు తీసిన ప్రశాంత్ నీల్ అందించిన స్టోరీతో వచ్చిన మూవీ ‘బఘీరా’. అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం నిన్న ఓటీటీలోకి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. సుమారు రూ.20 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా కన్నడలో రూ.29 కోట్లు వసూలు చేసింది. తెలుగులో నిరాశపర్చింది.
Similar News
News November 26, 2024
ఒక్కరోజులో రూ.4లక్షలు తగ్గిన బిట్‌కాయిన్
బిట్‌కాయిన్ జోరు తగ్గింది. లక్ష డాలర్ల స్థాయి వద్ద గట్టి రెసిస్టెన్సీ ఎదురవ్వడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నారు. సోమవారం ఏకంగా 5000 డాలర్లు నష్టపోయి $93035 వద్ద స్థిరపడింది. అంటే భారత కరెన్సీలో నిన్న ఒక్కరోజే రూ.4లక్షల మేర పడిపోయింది. నేడు $93,006 వద్ద ఓపెనైన BTC $94,920 వద్ద గరిష్ఠ, $94,331 వద్ద కనిష్ఠ స్థాయుల్ని అందుకుంది. ప్రస్తుతం $1300 లాభంతో 94,350 వద్ద కొనసాగుతోంది.
News November 26, 2024
తిరుమల ఆలయ హుండీలో చోరీ
తిరుమల శ్రీవారి ఆలయంలోని హుండీ నుంచి ఓ భక్తుడు నగదు చోరీ చేశాడు. తమిళనాడుకు చెందిన వేణులింగం రూ.15వేలు తీసినట్లు అధికారులు సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. ఈనెల 23న మధ్యాహ్నం ఈ ఘటన జరగ్గా సాయంత్రం అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి డబ్బు స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించారు.
News November 26, 2024
ఈవీఎంలపై మరోసారి YS జగన్ వ్యాఖ్యలు
AP: EVMల పనితీరుపై దేశవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నందున మెజార్టీ దేశాల్లో ఉన్నట్టుగా బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలకు ఎందుకెళ్లకూడదని మాజీ CM జగన్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం గొప్పగా కనిపించడమే కాదు విజయవంతంగా కూడా ఉండాలని ట్వీట్ చేశారు. ప్రాథమిక హక్కయిన వాక్‌స్వాతంత్య్రాన్ని అణచివేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఆందోళనకరమన్నారు. 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేడ్కర్ దార్శనికతను కొనియాడారు.