News November 22, 2024

AR రెహమాన్‌ కుమారుడు ఎమోషనల్ పోస్ట్

image

భార్య సైరా బానుతో విడిపోతున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయనపై వస్తున్న రూమర్స్ పట్ల కుమారుడు ఏఆర్ అమీన్ స్పందించారు. ‘నా తండ్రి లెజెండ్. ఆయన విలువలు పాటిస్తూ ఎనలేని గౌరవం, ప్రేమను సంపాదించారు. నా తండ్రిపై అసత్య, అర్థరహిత వార్తలు చూస్తే బాధేస్తోంది. తప్పుడు సమాచారం వ్యాప్తిని మానుకొని, ఆయన మనపై చూపిన ప్రభావం పట్ల గౌరవంగా ఉందాం’ అని పోస్ట్ చేశారు.

Similar News

News November 23, 2024

దీపం-2 స్కీమ్: 50 లక్షలు దాటిన లబ్ధిదారుల సంఖ్య

image

AP: దీపం-2 పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య 3 వారాల్లోనే 50 లక్షలకు చేరిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నామని, కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ పథకానికి గ్యాస్ కనెక్షన్, ఆధార్, తెల్ల రేషన్ కార్డు ఉండాలని పేర్కొన్నారు.

News November 23, 2024

విమానాలు లేటైతే ప్యాసింజర్లకు స్నాక్స్, వాటర్!

image

ఎయిర్‌లైన్ ప్యాసింజర్ల కోసం DGCA కీలక నిర్ణయం తీసుకుంది. విమానాలు ఆలస్యమైనప్పుడు వారికి ఎయిర్‌లైన్ సంస్థలు త్రాగు నీరు, ఆహారం అందించాలని ఆదేశాలు జారీ చేసింది. 2 గంటలు ఆలస్యమైతే వాటర్, 2-4 గంటలు లేట్ అయితే టీ/కాఫీ, స్నాక్స్, 4 గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే భోజనం ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రస్తుతం శీతాకాలం కావడంతో పొగ మంచు కారణంగా కొన్ని ఫ్లైట్స్ డిలే అవుతున్న సంగతి తెలిసిందే.

News November 23, 2024

దేశంలో రైల్వేస్టేషన్ లేని ఏకైక రాష్ట్రం ఇదే

image

దేశంలోని ప్రతీ రాష్ట్రంలో రైల్వే లైన్ ఉంది. సిక్కింలో మాత్రం రైల్వే సౌకర్యం లేదు. అక్కడి ప్రతికూల వాతావరణమే ఇందుకు కారణం. నిటారుగా ఉండే లోయలు, ఇరుకైన మార్గాలు, ఎత్తైన పర్వతాల వల్ల రైల్వే లైన్లు నిర్మించడం కుదరదు. పైగా ఇక్కడ తరచూ కొండ చరియలు విరిగిపడతాయి. రాష్ట్రంలో ఎన్ని టూరిజం స్పాట్‌లు ఉన్నా రైల్వే సౌకర్యం లేక ఆదరణ తగ్గుతోంది. ఇటీవలే రంగ్‌పో రైల్వే స్టేషన్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.