News November 22, 2024
రెచ్చిపోతున్న హిజ్రాలు!
HYDలో హిజ్రాల దోపిడీ మితిమీరుతోందని, పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, షాప్ ఓపెనింగ్స్.. ఇలా శుభకార్యమేదైనా వేలకు వేలు దండుకుంటున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. పెళ్లికూతురు, పెళ్లికొడుకు ఇళ్లల్లో రూ.30వేలు తీసుకున్నారని ఓ నెటిజన్ వాపోయారు. ఎక్కడ ఫంక్షన్ జరిగినా వాళ్లకెలా తెలుస్తోందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. మరి మీకూ హిజ్రాలతో ఇలాంటి అనుభవం ఎదురైందా?
Similar News
News November 23, 2024
నేడే మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
మహారాష్ట్రలో 288, ఝార్ఖండ్లో 81 అసెంబ్లీ స్థానాల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. MHలో మహాయుతి, మహా వికాస్ అఘాడీ కూటముల్లో ఏది గెలవనుందనే దానిపైనే అందరి దృష్టి నెలకొంది. అలాగే వివిధ రాష్ట్రాల్లో 48 అసెంబ్లీ స్థానాలకు, రెండు లోక్సభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలూ నేడే రానున్నాయి. వయనాడ్ లోక్ సభ స్థానంలో నిలిచిన ప్రియాంక గాంధీ భవితవ్యం ఈరోజే తేలనుంది. ఉ.8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది.
News November 23, 2024
ఈనెల 30న రైతు విజయోత్సవ సభ: భట్టి
TG: ఈనెల 30న మహబూబ్నగర్లో రైతు విజయోత్సవ సభ నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ మార్గాల్లో భారీ కార్నివాల్, లేజర్ షోతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
News November 23, 2024
దీపం-2 స్కీమ్: 50 లక్షలు దాటిన లబ్ధిదారుల సంఖ్య
AP: దీపం-2 పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య 3 వారాల్లోనే 50 లక్షలకు చేరిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నామని, కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ పథకానికి గ్యాస్ కనెక్షన్, ఆధార్, తెల్ల రేషన్ కార్డు ఉండాలని పేర్కొన్నారు.