News November 22, 2024
SKLM: డిగ్రీ విద్యార్థుల ఆందోళన..!
శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ విద్యార్థులు 2, 4 సెమిస్టర్లకు సంబంధించి ఆగస్టులో రీవాల్యుయేషన్ పెట్టారు. దాదాపుగా మూడు నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఫలితాలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా యూనివర్సిటీ అధికారులు స్పందించి ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారనేది ప్రకటించాలని విద్యార్థులు కోరుతున్నారు.
Similar News
News November 23, 2024
SKLM: ముగిసిన B.Ed సెమిస్టర్ పరీక్షలు
శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో B.Ed 2వ సెమిస్టర్ పరీక్షలు శుక్రవారంతో ప్రశాంతంగా ముగిశాయి. ఈ పరీక్షలు ఈనెల 19వ తేదీన ప్రారంభమయ్యాయి. మొత్తం జిల్లాలో 8 పరీక్ష కేంద్రాల్లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పరీక్షలు నిర్వహించారు. జిల్లా పరిధిలోని B.Ed కళాశాలల నుంచి 901 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
News November 23, 2024
నేడు శ్రీకాకుళం జడ్పీ సర్వసభ్య సమావేశం
శ్రీకాకుళం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని శనివారం ఉదయం నిర్వహించనున్నట్లు CEO ఎల్.ఎన్.వి శ్రీధర్ రాజా ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ పిరియా విజయ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్తో పాటు జిల్లా స్థాయి అధికారులు హాజరవుతారని స్పష్టం చేశారు.
News November 22, 2024
SKLM: డిగ్రీ పరీక్షల షెడ్యూల్ విడుదల
శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 3వ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ డీన్ డాక్టర్ పద్మారావు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 63 పరీక్ష కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశామన్నారు.