News November 22, 2024
నాలుగు నెలల కనిష్ఠానికి విదేశీ మారక నిల్వలు
భారత విదేశీ మారక నిల్వలు గత వారంలో ఏకంగా $17.8 బిలియన్ మేర పతనమయ్యాయి. ఈ భారీ తగ్గుదల నేపథ్యంలో నిల్వలు $657.89 బిలియన్లకు చేరుకుని నాలుగు నెలల కనిష్ఠ స్థాయిని తాకాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరం డాలర్ విలువ క్రమంగా పెరగడం వంటి పరిణామాల నేపథ్యంలో రూపాయి విలువను బలపరిచేందుకు ఫారెక్స్ మార్కెట్‌లో ఆర్బీఐ తన నిల్వలను అమ్మకాలకు ఉంచడం ఈ పరిస్థితికి కారణమైంది.
Similar News
News November 23, 2024
గ్రూప్-2 వాయిదా వేయాలని డిమాండ్
TG: రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షలు డిసెంబర్ 15, 16 తేదీల్లో జరగనుండగా, RRB జూ.ఇంజినీర్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అదే నెల 16, 17, 18 తేదీల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. 16న ఒకే రోజు రెండు పరీక్షలు ఉండడంతో, రెండింటికీ దరఖాస్తు చేసుకున్న వారు ఏదో ఒక దానిని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. RRB దేశవ్యాప్తంగా జరిగే పరీక్ష కావడంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-2ను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
News November 23, 2024
పెర్త్ టెస్టుకు రికార్డ్ బ్రేకింగ్ అటెండెన్స్
పెర్త్ వేదికగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న BGT తొలి టెస్టుకు తొలి రోజు 31,302 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఒక్క రోజులో ఇంత మంది అక్కడ మ్యాచ్‌ను చూడటం ఇదే తొలిసారి. దీంతో పెర్త్‌లో సింగిల్ డేలో అత్యధిక మంది చూసిన మ్యాచ్‌గా ఇది రికార్డు సృష్టించింది. నేడు, రేపు మ్యాచ్ మరింత ఆసక్తికరంగా జరిగే అవకాశమున్న నేపథ్యంలో ఈ టెస్టులోనే ఈ రికార్డు బ్రేక్ అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు.
News November 23, 2024
నేడే మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
మహారాష్ట్రలో 288, ఝార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్థానాల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. MHలో మహాయుతి, మహా వికాస్ అఘాడీ కూటముల్లో ఏది గెలవనుందనే దానిపైనే అందరి దృష్టి నెలకొంది. అలాగే వివిధ రాష్ట్రాల్లో 48 అసెంబ్లీ స్థానాలకు, రెండు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలూ నేడే రానున్నాయి. వయనాడ్ లోక్ సభ స్థానంలో నిలిచిన ప్రియాంక గాంధీ భవితవ్యం ఈరోజే తేలనుంది. ఉ.8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది.