News November 22, 2024

కేజ్రీవాల్ కంటే ఆతిశీ వెయ్యి రెట్లు నయం: LG

image

ఆప్ ప్ర‌భుత్వంతో నిత్యం త‌గువుకు దిగే LG సక్సేనా మొద‌టి సారి CM ఆతిశీని ప్ర‌శంసించారు. IGDT మ‌హిళా యూనివ‌ర్సిటీ స్నాత‌కోత్స‌వంలో ఆయ‌న మాట్లాడారు. ‘లింగ భేదాన్ని నిలువ‌రించి ఇత‌రుల‌తో స‌మానంగా మహిళలు అన్ని రంగాల్లో నిరూపించుకోవాలి. ఈ రోజు ఢిల్లీ సీఎం మహిళ అయినందుకు సంతోషిస్తున్నా. గ‌త పాల‌కుడి(కేజ్రీవాల్‌) కంటే ఆమె వెయ్యి రెట్లు న‌యం’ అన్నారు. LG వ్యాఖ్యలు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారితీశాయి.

Similar News

News November 12, 2025

నోట్లు తీసుకొని.. ఓట్లు మరిచారు!

image

TG: జూబ్లీహిల్స్ బైఎలక్షన్‌లో 50శాతం పోలింగ్ కూడా నమోదు కాలేదు. ప్రధాన పార్టీలు రూ.వందల కోట్లు పంచినట్లు తెలుస్తున్నా.. ఇచ్చిన డబ్బులు తీసుకొని ఓటర్లు ముఖం చాటేశారని ప్రచారం జరుగుతోంది. చాలా చోట్ల బస్తీవాసులు హక్కు వినియోగించుకోగా అపార్ట్‌మెంట్లలో ఉన్నవారు ఆసక్తి చూపలేదు. ఇక ఇక్కడ ఉంటూ వేరే ప్రాంతాల్లో పనిచేసే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు సెలవు లేకపోవడమూ పోలింగ్‌పై ప్రభావం చూపింది.

News November 12, 2025

హైపర్ పేరెంటింగ్ గురించి తెలుసా?

image

ఈ పేరెంటింగ్ పద్ధతిలో తల్లిదండ్రులు పిల్లల ప్రతి తప్పు, సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. వారు ప్రతి అంశంలోనూ ఉత్తమంగా ఉండాలని కోరుకుంటారు. దీంతో పిల్లలపై ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తుంది. సొంతంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉండదు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలు తప్పులు చేస్తే అంగీకరించరు. దీంతో పిల్లలు కూడా వారిని అర్థం చేసుకోలేరు. ఇలా తల్లిదండ్రులు, పిల్లల మధ్య దూరం పెరిగే అవకాశం ఉంటుంది.

News November 12, 2025

పెట్టుబడుల సదస్సుకు సిద్ధం.. నేటి రాత్రికే విశాఖకు సీఎం

image

AP: ఈ నెల 14, 15 తేదీల్లో పెట్టుబడుల సదస్సు నేపథ్యంలో CM చంద్రబాబు ఇవాళ రాత్రికే విశాఖ చేరుకోనున్నారు. రేపు సమ్మిట్ ఏర్పాట్లపై సమీక్ష, పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి వారికి డిన్నర్ ఇస్తారు. సదస్సుకు 33 మంది విదేశీ మంత్రులు, 47 మంది రాయబారులు రానున్నారు. 11 రంగాల్లో రూ.9.76 లక్షల కోట్ల పెట్టుబడులకు 410 ఒప్పందాలు జరగనున్నాయి. 7.48 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.