News November 22, 2024

గంభీర్ మాటలతో స్ఫూర్తి పొందాను: నితీశ్ రెడ్డి

image

బౌన్సర్‌ అయినా సరే తట్టుకుని నిలబడాలని కోచ్ గౌతమ్ గంభీర్ చెప్పిన మాటలు తనకు స్ఫూర్తినిచ్చాయని టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి తెలిపారు. ‘చివరి ప్రాక్టీస్ సెషన్ తర్వాత గౌతమ్ నాతో మాట్లాడారు. బౌన్సర్ వచ్చినప్పుడు దేశం కోసం తూటాకు అడ్డునిలబడినట్లే భావించాలని చెప్పారు. ఆ మాటలు నాలో నాటుకుపోయాయి. ఆయన్నుంచి నేను విన్న బెస్ట్ సలహా అది’ అని పేర్కొన్నారు.

Similar News

News November 26, 2024

IPL ఎలా, ఎందుకు మొదలైందో తెలుసా?

image

2007 T20 WCలో టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టడంతో ప్రపంచం మొత్తం మార్మోగిపోయింది. ఈ క్రేజ్ చూసి ఇండియాలోనూ T20 టోర్నీ నిర్వహించాలని అప్పటి BCCI వైస్ ప్రెసిడెంట్ లలిత్ మోదీ భావించారు. ఈ విషయాన్ని BCCI పెద్దలకు చెప్పారు. అనుకున్నదే తడవుగా టీ20 క్రికెట్ లీగ్ ప్రారంభించారు. అలా 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. ఈ లీగ్‌కు లలిత్ మోదీ ఫస్ట్ కమిషనర్‌.

News November 26, 2024

IPL: ఏ టీమ్ బలంగా ఉంది?

image

2025 మార్చి 14న మొదలయ్యే IPLకు రంగం సిద్ధమైంది. నిన్న, మొన్నటి వేలంలో ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కోసం తీవ్రంగా పోటీపడ్డాయి. ఇక ట్రోఫీ కోసం ఆటగాళ్లు తలపడటమే మిగిలింది. ఈ వేలం తర్వాత కొన్ని జట్లు బలంగా మారితే.. మరికొన్ని జట్లు మాత్రం అభిమానుల అంచనాలను అందుకోలేదు. అయితే MI, DC, SRH, CSK తెలివిగా ఆటగాళ్లను కొన్నాయనే అభిప్రాయాలున్నాయి. ఇంతకీ ఏ జట్టు బలంగా ఉందని మీరు భావిస్తున్నారు? కామెంట్ చేయండి.

News November 26, 2024

నిర్మలా సీతారామన్‌తో ముగిసిన పవన్ భేటీ

image

AP: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో Dy.CM పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘25 లక్షల జనాభాకు 7 వేల కి.మీ రోడ్లు నిర్మించాలని అడిగా. ఇప్పటికి 9 లక్షల జనాభాకే నిర్మాణం జరిగింది. రహదారుల నిర్మాణానికి AI బ్యాంక్ నుంచి నిధులు ఇప్పించాలని మంత్రిని కోరా. 90 శాతం నిధులు ఆ బ్యాంక్ నుంచి వచ్చేలా చూడాలని అడిగా. వీటిపై మంత్రి సానుకూలంగా స్పందించారు’ అని పేర్కొన్నారు.