News November 22, 2024
తిరుమల లడ్డూపై సిట్ విచారణ ప్రారంభం
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడటంపై సిట్ విచారణ ప్రారంభించింది. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేసి సీబీఐకి తుది నివేదిక ఇవ్వనుంది. ఈ బృందం తిరుపతి, తిరుమల, ఏఆర్ డెయిరీల్లో విచారణ చేయనుంది. నాలుగు టీమ్‌లుగా ఏర్పడి అన్ని అంశాలపై లోతుగా దర్యాప్తు చేయనుంది. ప్రస్తుతం సిట్ బృందానికి తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశారు.
Similar News
News November 23, 2024
మహారాష్ట్ర మేజిక్ ఫిగర్ ఎంతంటే?
మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో మేజిక్ ఫిగర్ 145. మహాయుతి, మహావికాస్ అఘాడీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. మహాయుతి కూటమిలో భాగంగా BJP-148, శివసేన షిండే వర్గం-80, అజిత్ పవార్ NCP వర్గం-53 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మహావికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్-103, శివసేన UBT-89, NCP SP-87 చోట్ల బరిలో నిలిచాయి. ప్రస్తుతం MHలో మహాయుతి అధికారంలో ఉంది.
News November 23, 2024
11 నెలల్లో 53వేలకు పైగా ఉద్యోగాలు: ప్రభుత్వం
TG: 11 నెలల్లో 53వేలకు పైగా ఉద్యోగాల్ని భర్తీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో విద్యాశాఖకు చెందినవే అత్యధికమని తెలిపింది. గురుకులాలు, స్కూళ్లలో 18,310 టీచింగ్ పోస్టులు, పోలీస్ శాఖలో 16,067 ఉద్యోగాలు, 7,094 స్టాఫ్ నర్స్ పోస్టులు భర్తీ చేశామని పేర్కొంది. ఇటీవల పలు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చామని, ప్రస్తుతం వివిధ విభాగాల్లో 5,378 పోస్టులకు నియామక ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది.
News November 23, 2024
నేడే ఫలితాలు.. WAY2NEWSలో EXCLUSIVEగా..
మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ప్రియాంకా గాంధీ బరిలో నిలిచిన వయనాడ్ సహా నాందేడ్ ఎంపీ స్థానానికి, వివిధ రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ సీట్ల బైపోల్ రిజల్ట్స్ కూడా వెలువడనున్నాయి. అన్నింటి ఫలితాలను ఎక్స్‌క్లూజివ్‌గా, అందరికంటే ముందుగా, వేగంగా WAY2NEWSలో తెలుసుకోండి. ఎప్పటికప్పుడు రిజల్ట్స్ అప్డేట్స్, అనాలసిస్ స్టోరీస్ అందుబాటులో ఉంటాయి. STAY TUNED.