News November 22, 2024
కోటి కుటుంబాలకు సర్వే పూర్తి
TG: రాష్ట్రవ్యాప్తంగా కోటి కుటుంబాలకు సమగ్ర ఇంటింటి సర్వే పూర్తయిందని ప్రభుత్వం వెల్లడించింది. ములుగు, జనగామ జిల్లాల్లో 100 శాతం, నల్గొండ, మెదక్ జిల్లాల్లో 99.9 శాతం సర్వే పూర్తయినట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.16 కోట్ల నివాసాలు గుర్తించామని, నేటి వరకు 1.01 కోట్ల నివాసాల్లో సర్వే కంప్లీట్ చేసి 87.1 శాతం సాధించామని వివరించింది.
Similar News
News November 23, 2024
విద్యాసంస్థలకు హెచ్చరిక.. అలా చేస్తే రూ.15లక్షల ఫైన్!
AP: రూల్స్ అతిక్రమించే ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ హెచ్చరించింది. స్టూడెంట్స్‌కు ఒరిజినల్ ధ్రువపత్రాలు ఇవ్వకపోతే, అధిక ఫీజులు వసూలు చేస్తే రూ.15లక్షల ఫైన్ విధించడంతో పాటు గుర్తింపును రద్దు చేసే అధికారం కమిషన్‌కు ఉంటుందని గుర్తుచేసింది. ఏవైనా సమస్యలుంటే 8712627318, 08645 274445 నంబర్లలో ఫిర్యాదు చేయొచ్చని విద్యార్థులకు సూచించింది.
News November 23, 2024
మహారాష్ట్ర మేజిక్ ఫిగర్ ఎంతంటే?
మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో మేజిక్ ఫిగర్ 145. మహాయుతి, మహావికాస్ అఘాడీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. మహాయుతి కూటమిలో భాగంగా BJP-148, శివసేన షిండే వర్గం-80, అజిత్ పవార్ NCP వర్గం-53 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మహావికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్-103, శివసేన UBT-89, NCP SP-87 చోట్ల బరిలో నిలిచాయి. ప్రస్తుతం MHలో మహాయుతి అధికారంలో ఉంది.
News November 23, 2024
11 నెలల్లో 53వేలకు పైగా ఉద్యోగాలు: ప్రభుత్వం
TG: 11 నెలల్లో 53వేలకు పైగా ఉద్యోగాల్ని భర్తీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో విద్యాశాఖకు చెందినవే అత్యధికమని తెలిపింది. గురుకులాలు, స్కూళ్లలో 18,310 టీచింగ్ పోస్టులు, పోలీస్ శాఖలో 16,067 ఉద్యోగాలు, 7,094 స్టాఫ్ నర్స్ పోస్టులు భర్తీ చేశామని పేర్కొంది. ఇటీవల పలు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చామని, ప్రస్తుతం వివిధ విభాగాల్లో 5,378 పోస్టులకు నియామక ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది.