News November 22, 2024
మమ్మల్ని రెచ్చగొట్టకండి: రష్యా హెచ్చరిక
ఉక్రెయిన్‌కు సాయం చేయడం మానుకోవాలని పశ్చిమ దేశాలకు రష్యా తాజాగా సూచించింది. తమను రెచ్చగొట్టొద్దని పేర్కొంది. ‘మా గడ్డపై జరిగే దాడుల్లో పశ్చిమ దేశాలు జోక్యం చేసుకోవద్దు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేయొద్దు. మీ వైఖరి ఇలాగే కొనసాగితే ఉక్రెయిన్‌పై మరిన్ని క్షిపణి దాడులు చేస్తాం’ అని హెచ్చరించింది. ఉక్రెయిన్‌లో జనావాసాల మీదకు రష్యా బాలిస్టిక్ క్షిపణి దాడి చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.
Similar News
News November 23, 2024
ఫలితాలకు ముందే క్యాంప్ కసరత్తులు
మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాల కౌంటింగ్ మొదలవక ముందే అక్కడ క్యాంపు రాజకీయాలకు తెరలేచింది. తాము గెలుస్తామని భావిస్తున్న మహా వికాస్ అఘాడీ గెలిచిన నేతలు చేజారకుండా శిబిరాలకు తరలించే కసరత్తు చేస్తోంది. తమ నేతలను ముంబైలోని క్యాంపుకు పంపుతామని శివసేన నేత సంజయ్ రౌత్ నిన్న ప్రకటించారు. అటు కూటమిలోని మిగతా పార్టీలు తెలంగాణ లేదా కర్ణాటకలో గెలిచిన అభ్యర్థులను దాచిపెట్టే అవకాశముందని సమాచారం.
News November 23, 2024
నేటి నుంచి SMAT-2024 టీ20 టోర్నీ
దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024 ఇవాళ్టి నుంచి జరగనుంది. మొత్తం 38 జట్లను ఐదు గ్రూపులుగా విభజించారు. హార్దిక్, శ్రేయస్, శాంసన్, రుతురాజ్ వంటి పలువురు స్టార్ క్రికెటర్లు బరిలోకి దిగనున్నారు. హైదరాబాద్ జట్టు గ్రూప్-Aలో, ఆంధ్రప్రదేశ్ టీమ్ గ్రూప్-Eలో ఉన్నాయి. జియో సినిమా యాప్/వెబ్‌సైట్‌లో లైవ్ చూడవచ్చు. ఉ.9 గంటల నుంచి మ్యాచులు జరుగుతాయి. షెడ్యూల్ కోసం ఇక్కడ <
News November 23, 2024
26 నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు మంజూరు
TG: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 26 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను మంజూరు చేసింది. ఈ లిస్టులో జగిత్యాల, రామగుండం, ధర్మపురి, వనపర్తి, బోధన్, డోర్నకల్, చొప్పదండి, PDPL, వైరా, కోదాడ, కొత్తగూడెం, కల్వకుర్తి, సత్తుపల్లి, నకిరేకల్, నాగార్జున సాగర్, తాండూరు, నారాయణ్ పేట, NZB రూరల్, చేవెళ్ల, జుక్కల్, మక్తల్, వికారాబాద్, గద్వాల, మెదక్, మేడ్చల్, ఆర్మూరు నియోజకవర్గాలు ఉన్నాయి.